విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ దశ దిశ ను ప్రజాసంకల్ప యాత్ర మార్చింది అని వైయస్ఆర్ సిపి యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి, గొల్లపూడి వైయస్సార్ సిపి యూత్ ఫోర్స్ నాయకుడు జి.రవికుమార్ అన్నారు. గొల్లపూడి లో ఆదివారం ప్రజా సంకల్ప యాత్ర ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన కార్యక్రమం లో జి.రవికుమార్ మాట్లాడుతూ 2017 నవంబర్ 6న తన ప్రజా సంకల్పయాత్రను ఇడుపులపాయలోని వైఎస్ రాజశేఖరరెడ్డి స్మారకం నుంచి ప్రారంభించి.. 2019 జనవరి 9 నాటికి ఇచ్చాపురం చేరుకుని చరిత్ర సృష్టించారన్నారు. సుధీర్ఘ పాదయాత్రలో నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారికి తానున్నానన్న భరోసాను కల్పించారన్నారు. 14 నెలల కాలంలో పదమూడు జిల్లాలను చుట్టేసి అన్ని వర్గాల ప్రజల కష్టాలు తెలుసుకుని కన్నీరు తుడిచారన్నారు. సుమారు మూడు కోట్లమందిని ప్రత్యక్షంగా కలిసి వారి సాదకబాధకాలను విన్న జగన్మోహన్ రెడ్డి.. నాడు గుంటూరు సభలో నవరత్నాలను ప్రకటించారన్నారు. ఆ నవరత్నాల హారమే నేడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి భగవద్గీతగా మారిందని గుర్తుచేశారు. 3,648 కిలోమీటర్ల దూరం సాగిన ఆ మహాపాదయాత్రలో నూతన శకానికి నాంది పలికిందన్నారు. అనేక సంస్కరణలతో యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచారని కీర్తించారు. అటువంటి గొప్ప నేతకి ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తూ, ప్రజల అవసరాలను గుర్తెరిగిన నిజమైన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోతారన్నారు.
Prajavartha Online Telugu News