Breaking News

ప్రజా సమస్యల పరిష్కరించడంలో ఎమ్మెల్యే వెల్లంపల్లి విఫలం… : కొట్టేటి హనుమంతరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసి, ప్రజలకు సమాధానం చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్న వెల్లంపల్లి శ్రీనివాస్ కు చంద్రబాబు నాయుడు ని విమర్శించే స్థాయి లేదని తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ కార్యదర్శి, మాజీ ఫ్లోర్ లీడర్ కొట్టేటి హనుమంతరావు అన్నారు. మంగళవారం కేశినేని శివనాథ్ (చిన్ని) కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొట్టెటి హనుమంతరావు మాట్లాడుతూ గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో జగన్ ప్రభుత్వ పథకాలు లోపాన్ని ప్రజలు ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేని ఈ చంద్రబాబు నాయుడు లాంటి ప్రజానాయకుడు పై అవాకులు, చవాకులు పేలితే ఊరుకునే ప్రసక్తే లేదని ఆయన విమర్శించారు. ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజలు తీవ్ర మైన ఇబ్బందులు పడుతున్నారని, సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి ప్రజలకు పూర్తిగా చేరడం లేదని, అనేక నిబంధనలతో వచ్చిన పథకాలను ఆపివేస్తూ ఈ పరిపాలన కొనసాగుతుందని, సంక్షేమ పథకాలను ఆపేసి, ప్రజలపై పన్నుల రూపంలో అదనపు వసూళ్లు చేస్తున్న ఈ జగన్ రెడ్డికి ప్రజలు కచ్చితంగా బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో కన్నీరు తప్ప ప్రజలకు ఏమి మిగలలేదని, ప్రజల జీవితాలతో చెలగాటమాడే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ, పోరాడుతుందని ఆయన తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో ఎవరికి ఏ పథకాలు వచ్చాయో ఎమ్మెల్యే వెల్లంపల్లి సమాధానం చెప్పగలరా, ఎన్ని పథకాలు తొలగించారో మీకు తెలుసా, అవి తెలుసుకొని మా గురించి మాట్లాడనని ఆయన ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ మైనారిటీ అర్బన్ మాజీ అధ్యక్షులు ఎస్కే ఇర్ఫాన్ మాట్లాడుతూ మైనారిటీలను మోసం చేసి, మైనార్టీ ఉద్ధరిస్తామని అబద్దాలు చెప్పారన్నారు.  మైనారిటీ నిధులను ఇతర అవసరాలకు మళ్లించి మైనార్టీలను పొట్ట కొట్టిన వారికి మైనార్టీలు కచ్చితంగా బుద్ధి చెప్తారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 34 డివిజన్ అధ్యక్షులు అట్లూరి కొండలరావు, 7వ డివిజన్ పార్టీ అధ్యక్షులు పడమట సతీష్ చంద్ర, నాయకులు పి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *