Breaking News

క్షౌర వృత్తిలోకి రిలయన్స్, కార్పొరేట్ వ్యాపారుల ప్రవేశాన్ని ప్రభుత్వాలు నిలపాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నాయి బ్రాహ్మణ సంఘాల నాయకుడు టిడిపి రాష్ట్ర బిసి సెల్ కార్యదర్శి నవిరి మహేష్ పిలుపు మేరకు క్షౌర వృత్తిలోకి రిలయన్స్ మరియు కార్పొరేట్ వ్యాపారుల ప్రవేశాన్ని ప్రభుత్వాలు నిలపాలని బీద క్షౌర వృత్తుల వారి పొట్ట కొట్టవద్దని నాయి బ్రాహ్మణ నాయకుడు  దాక్షరపు సూరి బాబు ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో చేపట్టిన నిరసన కార్యక్రమానికి టిడిపి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మద్దతు పలికారు.  ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ క్షౌరదారుల సమస్యలను వారి వారి సంఘాల ద్వారా ఎంపి కేశినేని శ్రీనివాస్ (నాని) దృష్టికి తీసుకు వెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరతామని నియోజకవర్గ పార్టీ పెద్దలు ఎమ్ ఎస్ బేగ్, పెందుర్తి శ్రీనివాస్, సారిపల్లి వెంకట రాధాకృష్ణ, పల్లంటి గంగాధర్, ధనేకుల వెంకట సుబ్బారావు, షేక్ హబిబ్, సయ్యద్ కరీముల్ల, డివిజన్ పార్టీ అధ్యక్షులు అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *