Breaking News

కూచిపూడి నాట్యంలో నంది అవార్డ్  సాధించిన  విద్యార్ధిని అభినందించిన నగర మేయర్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తమిళనాడు, వెల్లూర్, సిరిపురం లోని శ్రీ లక్ష్మీనారాయణి గోల్డెన్ టెంపుల్ లో 06-11-2022 న జరిగిన శ్రీ సాయి నాట్యాంజలి పైన్ ఆర్ట్స్ డెవలప్మెంట్ అసోసియేషన్ 7th నేషనల్ లెవల్ నంది డాన్స్ పెస్టివల్ విభాగంలో విజయవాడకు సంభందించి వన్ టౌన్, కొత్తపేటలో గల S.K.P.V.V.హిందూ హై స్కూల్ లో 8th క్లాసు చదువుతున్న మోదుకూరి బాలసరస్వతి కూచిపూడి ప్లేట్ డాన్స్ విభాగంలో నారాయణి నంది అవార్డ్  సాధించడం జరిగింది. మంగళవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో మేయర్ చాంబర్ నందు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారిని మోదుకూరి బాలసరస్వతి ఆమె తల్లితండ్రులతో మర్యాద పూర్వకంగా కలుసుకొన్నారు.  ఈ సందర్బంలో ఆమె విజేతగా నిలిచిన చిన్నారిని అభినందిస్తూ, భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాదించి నగరానికి మణిహారంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ సందర్బంలో శిక్షణ కల్పించిన కోచ్ ను అభినందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *