Breaking News

పేదల పెన్నిధి మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి… : మంత్రి జోగి రమేష్

పెడన, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిత్యం పేదల క్షేమం కోరే పేదల పెన్నిధి అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. మంగళవారం ఆయన పెడన పట్టణ మున్సిపాలిటీ రెండవ సచివాలయ పరిధిలోని 6వ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇంటింటిని సందర్శిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు వివరిస్తూ కరపత్రాలను వారికి అందించారు. లబ్ధిదారుల గుమ్మాల్లోకి వెళ్లి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ మన అందరి బాగుకోసం మంచి చేస్తున్న జగనన్నను దీవించాలని మంత్రి కోరారు. ప్రతిగా లబ్ధిదారులు చిరునవ్వులు చిందిస్తూ అందుతున్న పథకాల పట్ల తమ సంతృప్తిని వ్యక్తం చేశారు. మళ్లీ ముఖ్యమంత్రిగా మాకు జగనే రావాలని లబ్ధిదారులు ముక్తకంఠంతో పలికారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు, ప్రజల కోసం ఏవైతే చేస్తానని తన సుదీర్ఘ పాదయాత్రలో రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారో వాటిని తూచా తప్పకుండా నెరవేర్చారని మంత్రి అన్నారు. అర్హులైన వారికి నవరత్నాలను అందించడంతోపాటు సచివాలయ వ్యవస్థ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 1.34 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలిచ్చి వారి కుటుంబాలలో జీవనజ్యోతి వెలిగించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలకు జవాబుదారీతనంగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి శ్రద్ధ తీసుకొని గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని ప్రజాప్రతినిధులను ప్రజల వద్దకు పంపుతూ శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. ప్రజల బాగు కోసం మంచి చేస్తున్న ముఖ్యమంత్రికి మరింత ప్రోత్సాహం అందిస్తూ ఆశీర్వదించాలని మంత్రి ప్రజలను కోరారు.
ప్రజల అభ్యర్థన మేరకు అవసరమైనచోట్ల సీసీ రోడ్లు, వీధిలైట్లు ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
కోట కృష్ణమూర్తి అనే వృద్ధుడు తనకు ఆరోగ్యం బాగోటం లేదని, మూడు చక్రాల బండిని ఇప్పించాలని మంత్రిని కోరగా అందుకు స్పందించిన ఆయన దానిని వెంటనే సమకూర్చేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో కృత్తివెన్ను జడ్పిటిసి మైలా రత్నకుమారి, 5వ వార్డు కౌన్సిలర్ వైస్ ఛైర్మెన్ ఎం.డి. ఖాజా, 6వ వార్డు కౌన్సిలర్ అబ్దుల్ ఖయ్యం, 3వ వార్డు కౌన్సిలర్ బళ్ళా గంగయ్య, 4 వ వార్డు కౌన్సిలర్ రెహతున్నీసా, పెడన తహసీల్దార్ పి.మధుసూదనరావు, పెడన మునిసిపల్ కమీషనర్ ఎం. అంజయ్య, పెడన మునిసిపాలిటీ ఫ్లోర్ లీడర్ కటకం ప్రసాద్, వైస్సార్ సీపీ పెడన పట్టణ అధ్యక్షులు బండారు మల్లిఖార్జునరావు, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *