-జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు పేదలందరికి జగనన్న గృహ నిర్మాణ పథకం, ప్రాధాన్యత భవన నిర్మాణ పనుల ప్రక్రియను వేగవంతంగా, యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి లక్ష్యాన్ని అధిగమించాలని కృష్ణాజిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ బంగ్లా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జగనన్న కాలనీలు, ప్రయారిటీ బిల్డింగుల నిర్మాణ పురోగతి, మౌలిక వసతులు, జగనన్న సంపూర్ణ గృహహక్కు,ఓటీఎస్ ప్రక్రియల యాక్షన్ ప్లాన్ తో పాటు అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు తీరు, పురోగతి తదితర అంశాల ఎజెండాలపై.. మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి ప్రత్యేక అధికారులు, హౌసింగ్ ఇంజినీరింగ్ అధికారులతో వివిధ అంశాలను గూర్చి అడుగుతూ, కార్యక్రమాల అమలు తీరుపై సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు కార్యక్రమం, పౌర సేవలు, సంక్షేమ పథకాలు..ప్రజలకు సంతృప్త స్థాయిలో అందేలా.. ప్రతి అధికారి నిబద్ధతతో పని చేయాలన్నారు. లక్ష్య సాధన కోసం మండల, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, ప్రతి వారం ప్రగతి నివేదికలు అందజేయాలన్నారు. ఈ సందర్భంగా.. మండలాలు, మున్సిపాలిటీల పరిధిలోని జగనన్న లే అవుట్లలో గృహ నిర్మాణ పనుల పురోగతిపై కలెక్టర్ మండలవారిగా ఒక్కొక్క అధికారిని అడిగి తెలుసుకున్నారు. గ్రౌండింగ్, మెటీరియల్, ఫైనాన్స్ అసిస్టెన్స్ మొదలైన అన్ని రకాల సదుపాయాలను సమకూర్చి..నిర్మాణ పనులను లక్ష్యం మేరకు పూర్తి చేయాలని ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు సమావేశానికి వచ్చేముందు సమగ్ర నివేధికాలతో అవగాహన కలిగి అడిగిన ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానం సూటిగా చెప్పాలని అన్నారు. పేదల ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి కనిపించాలని, అలసత్వం వహించే అధికారులపై చర్యలు తప్పవన్నారు. ఇప్పటికీ ప్రారంభంకాని ఇళ్లన్నీ సత్వరమే ప్రారంభించి పునాది స్థాయికి తీసుకురావాలన్నారు. ప్రారంభంకాని ఇళ్లన్నీ సత్వరమే ప్రారంభించి బిబిఎల్ స్థాయిలో ఉండేలా తక్షణమే చూడాలన్నారు. పేదల ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకోని చిత్తశుద్ధితో సమర్థవంతంగా పనిచేయాలన్నారు. జగనన్న గృహ నిర్మాణాలలో ముఖ్యంగా విద్యుత్, నీటి సరఫరాకు సదుపాయాలను సమకూర్చాలన్నారు. గృహ నిర్మాణ పనుల్లో అధికారులు చిత్త శుద్దితో పనిచేసి నిర్దేశించిన, ఆశించిన పురోగతిని చూపిస్తూ.. ప్రతి అంశాన్ని ఆన్ లైన్ లో నమోదు చేయాలన్నారు. ప్రాధాన్యతా భవన నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించి పనులు పూర్తి చేయాలన్నారు. ప్రయారిటీ బిల్డింగ్స్ కు సంబంధించి, పురోగతిలో వెనకబాటులో ఉన్న, ఇప్పటికీ బేస్మెంట్ కూడా జరగని గ్రామాల్లో.. పంచాయితీరాజ్ శాఖ డీఈలు, ఈఈలు, ఏఈలు ఎం.ఎస్.ఓ.లు ఆయా గ్రామాల్లో జరుగుతున్న గృహనిర్మాణ పనులను అక్కడే బస చేసి నిర్మాణ దశలోకి తీసుకురావాలని ఆదేశించారు. అన్ని నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు ఈ వారం చివరిలోగా… సచివాలయాల పరిధిలో ప్రయారిటీ బిల్డింగ్స్ గ్రౌండింగ్ పనులు ప్రారంభం అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు.
Prajavartha Online Telugu News