Breaking News

ప్రజా సంక్షేమమే జగనన్న లక్ష్యం : దేవినేని అవినాష్

-కొండప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రత్యేక దృష్టి పెట్టి కొండప్రాంతంలో కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 2వ డివిజన్ 35వ సచివాలయ పరిధిలోని మసీదు వీధి నుండి ప్రారంభమై శ్రీలంక కొండ అంచు ప్రాంతాల్లో అవినాష్ ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ లబ్ది వివరాల కరపత్రాలు అందజేసారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత పాలన గాడిన పడింది అని,మా బ్రతుకుల్లో వెలుగులు నిండాయని ప్రజలు తమ సంతోషం వ్యక్తం చేస్తూ గడపగడపకు వస్తున్న వైసీపీ నాయకులకు బ్రహ్మరథం పడుతున్నారు అని అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం లో ఈ కొండ ప్రాంతాల్లో అభివృద్ధి అనేది లేదని కొండంచున నివసించే వారు పైకి వెళ్ళడానికి సరైన మెట్ల మార్గాలు కూడా లేకుండా ప్రమాదకరమైన పరిస్థితులు ఉండేవని, కనీసం ఇక్కడ నివసించే వారికి సంక్షేమ పథకాలు కూడా ఇచ్చేవారు కాదని విమర్శించారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత నూతన మెట్లు మార్గాలతో పాటు నడిచే వారికి భద్రత కోసం ఇరువైపులా రైలింగ్ కూడా ఏర్పాటు చేశామని అన్నారు. కొండంచున నివసించే వారికి కూడా వాలంటీర్లు ఇంటి వద్దకే వెళ్లి సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని అన్నారు. కొండ ప్రాంతం అధికంగా ఉన్న ఈ డివిజన్ లో మంచినీటి కుళాయిలు ఏర్పాటు గాని, సైడ్ డ్రైనేజ్ నిర్మాణాలు,ఇతర మౌలిక సదుపాయాలు కల్పించి వారికి అండగా నిలబడింది వైసీపీ ప్రభుత్వం అని చెప్పారు.కేవలం అధికారంలోకి వచ్చిన మూడేళ్ళ కాలంలోనే దాదాపు 450 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేపటద్దం జరిగిందని, కేవలం వారి రాజకీయ మనుగడ కోసం ప్రచార అర్భటల కోసమే తెలుగుదేశం నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారు అని ఎద్దేవా చేశారు. గత 5 ఏళ్లలో మీరు చేసిన అభివృద్ధి మీద ఈ మూడేళ్ళ కాలంలో మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి మీద ప్రజల అభిప్రాయం తెలుసుకోండి అని హితవు పలికారు. కొండ అంచు ప్రాంతంలో ప్రజలు వారి సంపూర్ణ మద్దతు వైసీపీ ప్రభుత్వనీకె అని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో 2వ డివిజన్ కార్పొరేటర్ అంబడిపూడి నిర్మలా కుమారి, వైస్సార్సీపీ నాయకులు చిన్నబాబు,నక్క సాంబయ్య, పాము సింహాచలం, మోయిన్, కోటేశ్వరరావు,

దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దివ్యాంగునికి వీల్ చైర్ అందజేత
విజయవాడ నగరంలో దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విస్తృతంగా సేవ కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెల్పిన ట్రస్ట్ చైర్మన్,తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్.

2వ డివిజన్ లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సోమవారం నాడు మసీద్ రోడ్ లో పర్యటించినప్పుడు నిరుపేద కుటుంబానికి చెందిన దివ్యంగా బాలుడు ఆరోగ్య పరిస్థితి గురుంచి వారి తల్లిదండ్రులు అవినాష్ దృష్టికి తీసుకురాగా వారికి సౌకర్యంగా ఉండేలా దాదాపు 10,000 రూపాయల విలువ గల వీల్ ఛైర్ ను దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందజేయడం జరిగింది.

అంతేకాకుండా భవిష్యత్ లో వారికీ ఏ అవసరం ఉన్న ట్రస్ట్ ద్వారా, ప్రభుత్వం ద్వారా అండగా ఉంటామని అవినాష్ భరోసా ఇచ్చారు. రాబోయే రోజుల్లో కూడా మా సేవా కార్యక్రమాలు ఇలాగే నిరాటంకంగా జరుపుతామని పూర్తి సహాయసహకారాలు ఉంటాయని తెల్పిన అవినాష్.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *