-మత్స్యకారులకు ఆర్థిక భరోసా కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం…
-జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఫిష్ రిటైల్ అవులెట్లను ఏర్పాటు చేసి మత్స్య సంపదకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించి వినియోగదారులకు తాజా ఉత్పత్తులను అందించడం ద్వారా మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు.
ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం పై జిల్లా స్థాయి అమలు కమిటీ సమావేశం మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయ సమావేశ మందిరంలో కమిటి చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అధ్యక్షతన నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకార కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న పథకాలను ఆయా వర్గాలు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయంతో నెలకొల్పే యూనిట్లు మత్స్యకారులకు ప్రయోజనం కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రధాన మంత్రి మత్య్స సంపద యోజనలో కేంద్రప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తుందన్నారు. ఇందులో భాగంగా ఫిష్ రిటైల్ అవులెట్లు, ఫిష్ రిటైల్ మార్కెటింగ్ హబ్‌లు, ఫిష్ కియోష్కా, ఐస్‌బాక్సులతో కూడిన టూవీలర్ త్రీ వీలర్ మోటర్ సైకిళ్ళ పంపిణీ, లైవ్‌ఫిష్ అమ్మక కేంద్రాల ఏర్పాటు వంటి పథకాలకు సబ్బిడీ పై ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. ఆయా పథకాలకు లబ్దిదారుల నుండి స్వీకరించిన ధరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేస్తున్నామన్నారు. 20 లక్షలతో ఇన్స్లేటడ్ వాహనాల ఏర్పాటుకు 6 ధరఖాస్తులను, ఐస్‌బాక్సులతో కూడిన టూవీలర్ మోటర్ సైకిల్‌కు 163 ధరఖాస్తులను, త్రీ వీలర్ మోటర్ సైకిల్‌కు 74 ధరఖాస్తులకు సంబంధించి మొత్తం 243 ధరఖాస్తులను అమోదిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు తెలిపారు. షిష్ ఆంధ్ర కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మత్స్య శాఖ అధికారులకు సూచించారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న మత్స్య సంపదను పెంచేలా మత్స్యకారులను ప్రోత్సహించాలన్నారు. నగరంలో లైఫ్ ఫిష్ అమ్మకాలపై ప్రజలు మక్కువ చూపుతున్నారన్నారు. కొనుగోలుదార్లను ఆకర్షించేలా విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి అమ్మకాలు నిర్వహించడం ద్వారా మత్స్యకారులను ఆర్థికంగా బలపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. మత్స్య అవులెట్ల కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు నగరంలో ఇరిగేషన్, ఆర్టిసి, నగరపాలక సంస్థ, మార్కెటింగ్, పశుసంవర్థక, పంచాయతీరాజ్ వంటి ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఖాళీ స్థలాలను గుర్తించాలన్నారు. ఆయా శాఖల నుండి అద్దె ప్రాతిపదికన స్థలాలను సేకరించి అవులెట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని మత్స్య ఫెడరేషన్ ద్వారా స్థలాలకు అద్దె చెల్లించడం జరుగుతుందన్నారు. ప్రకాశం బ్యారేజ్ ఎగువన కృష్ణానదిలో 20 లక్షల చేప పిల్లలను విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. విడుదల చేసిన చేప పిల్లలు పెరిగిన అనంతరం దాదాపు 1500 మంది మత్స్య కుటుంబాల వారు చేపలను వేటాడడం ద్వారా ఆర్థిక లబ్ది పొందేందుకు అవకాశం కల్పించినట్లవుతుందని కలెక్టర్ డిల్లీరావు అన్నారు.
సమావేశంలో జిల్లా మత్స్య శాఖ అధికారి ఏ నాగరాజా, జిల్లా వ్యవసాయ అధికారిణి యం విజయభారతి, డిఆర్డిఏ ఎన్. కిరణ్‌కుమార్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రుక్మాందయ్య, ఎల్డియం పి. కోటేశ్వరరావు, పియంఎస్ డైరెక్టర్ లంకె గోవిందరాజులు, ఏడి సిహెచ్ చక్రాణి, ఎఫ్‌డివోలు పి అఖిల, కె. నాగబద్ర, బి లెనిన్‌బాబు, ఉన్నారు.
Prajavartha Online Telugu News