-షేక్ జబినాకు ఆమె కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేస్తుంది…
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముక్కుపచ్చలాడని చిన్నారి షేక్ జబినాపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడుని కఠినంగా శిక్షిస్తామని జబినా కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా న్యాయం చేస్తుందని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు తెలిపారు. అఘాయిత్యానికి గురి అయి పాత ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పాత రాజరాజేశ్వరిపేటకు చెందిన షేక్ జబినాను మంగళవారం జిల్లా కలెక్టర్ ఎస్డిల్లీరావు పరామర్శించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అభంశుభం తెలియని చిన్నారిపై కామాందుడు అఘాయిత్యానికి పాల్పడడం అత్యంత దురదృష్టకరమన్నారు. సభ్య సమాజం తలదించుకునే ఇటువంటి సంఘటన జరగడం మనసును కలిచివేస్తోందన్నారు.
Prajavartha Online Telugu News