Breaking News

పౌర సేవలు అందించే సామర్థ్యం పెంపొందించే విధంగా చర్యలు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇళ్ల నిర్మాణాలు స్టేజ్ కన్వర్షన్, గ్రామ, వార్డ్ సచివాలయాల్లో పౌర సేవలు అందించే సామర్థ్యం పెంపొందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు.

గురువారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం అనంతరం కలెక్టర్ కార్యాలయం నుంచి రాష్ట్ర స్థాయి ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు
పి. సాయి ప్రసాద్, పి ఎస్ ప్రద్యుమ్న, గోపాలకృష్ణ ద్వివేది, తదితరులు వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్ లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాధవీలత, గ్రామ వార్డు సచివాలయ భవనాలు, పూర్తి చేసిన ఇండ్లకు విద్యుత్ సౌకర్యం, స్పందన స్టేటస్, వాలంటీర్లు సేవలు, వివిధ సంక్షేమ పథకాలు అమలు, జగనన్న తోడు, ఈ బి సి నేస్తం, సచివాలయంలో ఈ సేవ ద్వారా అందచేస్తున్న వివరాలు తెలియచేశారు .

సమగ్ర సర్వే పూర్తయిన  గ్రామాలకు త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి భూహక్కు పత్రాలను పంపిణీ చేయనున్నారని పి. సాయి ప్రసాద్ అన్నారు. భూహక్కు- భూరక్ష పత్రాలు మంజూరుచేయబోయే పట్టదారుల వివరాలను కలెక్టర్లు క్షుణ్ణంగా పరిశీలించి తమకు పంపాలని పేర్కొన్నారు. జిల్లాలో 15 గ్రామాల్లో సర్వే పూర్తి అయ్యిందని, జిల్లాకు చెందిన సుమారు 4 వేల పట్టాలు అందాయని వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగిందన్నారు.

బిఎంసియు (బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్), ఎఎంసియు ( ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్స్) నిర్మాణాలు బి ఎం సి యూ వీలైనంత త్వరగా పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలని  మార్కెటింగ్ శాఖ కమీషనర్ పి.ఎస్.ప్రద్యుమ్న సంయుక్త కలెక్టర్లకు సూచించారు. జిల్లాలో 49 బి ఎం సి యూ, 38 ఏ ఎం సి యూ యూనిట్స్ ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వివరించారు.  పెయ్య దూడల వీర్య నాళికలు డోసులు 1600 వందలు అందాయని వాటిని మండలానికి 75 చొప్పున సరఫరా చేసి, రైతుల కు అవగాహన కోసం చర్యలు తీసుకోవడం జరిగిందని మాధవీలత పేర్కొన్నారు.

ప్రాధాన్యత భవనాలు నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించే దిశలో అడుగులు వేస్తున్నట్లు, ఇప్పటికీ ప్రతి రోజు వాటిపై డివిజన్ స్థాయి అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహిస్త్నున్నట్లు కలెక్టర్ తెలియ చేశారు.

జిల్లాలో 56220 ఇళ్ల నిర్మాణం కోసం మంజూరు చెయ్యగా వాటిలో 47317 ఇళ్లను ప్రారంభించామని, గతవారం 2,687 ఇళ్లు, ఈ వారం లో 1225 ఇళ్లని స్టేజ్ కన్వర్ట్ చెయ్యడం జరిగిందన్నరు. విద్యుత్ కనెక్షన్లు ఇవ్వవలసిన 7218 ఇళ్ల కుగాను 6964 ఇళ్లకు విద్యుత్ మీటర్ల బిగించి నట్లు తెలియ చేశారు. పౌర సేవలు కి సంబంధించి సచివాలయలకు వచ్చిన 866 దరఖాస్తుల్లో 177 పరిష్కరించి, 689 పరిశీలనలో ఉన్నాయి. సర్టిఫికెట్స్ సంబంధించి 9461 కి గాను 3679 జారీ చేయగా, 5782 పరిశీలనలో ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు.

స్పందన లో 734 దరఖాస్తులు వచ్చాయని, వాటిని ఎస్ ఎల్ ఏ పరిధిలో పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ మాధవీలత అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కింద 788 పనులు గుర్తించడం జరిగిందని, వాటిలో 727 పనులకు మంజూరీ చేసి వాటిలో 650 పైగా పనులు పురోగతిలో ఉన్నట్లు వివరించారు. వాలంటీర్ సేవలకు చెంది 9464 క్లస్టర్ లకు గాను 9401 క్లస్టర్ పరిధిలో అమ్మఒడి, 5547 చోట్ల వాహన మిత్రా, 5960 చోట్ల కాపు నేస్తం, 131 చోట్ల నేతన్న నేస్తం, 8745 చోట్ల జగనన్న విద్యా దీవెన , 8934 క్లస్టర్ లలో వైయస్ఆర్ చేయూత పథకం అమలు చేస్తున్నట్లు వివరించారు.
సచివాలయం పరిధిలో కనీసం రోజుకు 50 సేవలు అందించే లక్ష్యంలో భాగంగా గతవారం 32,128 సేవలు, ఈ వారంలో 37,742 సేవలు అందించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో సగటున 74 సేవలు అందించడం జరుగుతొందని ఆమె తెలియచేశారు.
మన బడి నాడు నేడు పనుల్లో రెండో దశలో చేపట్టిన 675 స్కూల్స్, కాలేజీలలో పనులు చేపట్టి, నాణ్యత కలిగే విధంగా క్షేత్ర స్థాయి అధికారులు, కాలేజీ, స్కూల్స్ ప్రిన్సిపల్స్, ప్రధానోపాధ్యాయులు, ఇంజనీరింగ్ అధికారులకు, అసిస్టెంట్స్ కు సూచనలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశాల్లో జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్, సంబందించిన శాఖల జిల్లా అధికారులు, పాల్గొనడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *