Breaking News

రైతుల నుంచి మద్దతు ధర కు ధాన్యం కొనుగోలు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఖరీఫ్ 2022-23 ఖరీఫ్ సీజన్లో పూర్తి స్థాయి లో రైతుల నుంచి మద్దతు ధర కు ధాన్యం కొనుగోలు చేపట్టే దిశలో అర్భికే లో రైతు పంట వివరాలు నమోదు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత స్పష్టం చేశారు. గురువారం కలెక్టర్ క్యాంపు నుంచి కలెక్టర్, కొవ్వూరు నుంచి జాయింట్ కలెక్టర్ సంయుక్తంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ లో పూర్తి పారదర్శకంగా రైతు లనుంచి ధాన్యం సేకరణ చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్ట మైన ఆదేశాలు జారీ చేశారని అందుకు అనుగుణంగా జిల్లా, డివిజన్, మండల యంత్రాంగం  చర్యలు తీసుకోవాలని పౌర సరఫరాలశాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారన్నారు. ప్రతి అర్భికే లో గన్ని బ్యాగులు సిద్దం చేసుకోవాలన్నారు. ,రైతులకు ఖరీఫ్ సీజన్లో పంత కొనుగోలు పై అవగాహన కోసం అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు . రైతులు వారు పండించిన పంట రవాణా కోసం స్వంతం గా వాహనాలు సమకూర్చుకుంటే ప్రభుత్వం నిర్ణయించిన ధర వారికే చెల్లించి వారికి రవాణా విషయంలో పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం జరుగుతుందని ఆమె అన్నారు.

కొవ్వూరు నుంచి పాల్గొన్న జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ మాట్లాడుతూ, ధాన్యం సేకరణ కి సంబంధించి పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుని ఆచరణలో పెట్టడానికి చొరవ చూపాలని అన్నారు. ధాన్యం సేకరణకు సరిపడే గన్ని బ్యాగులు ప్రతి అర్భికే కు వొచ్చే ధాన్యం కు అనుసంధానంగా సిద్దం చేసుకోవాలన్నారు. రొటేషన్ పద్దతిలో వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హమాలీ ఛార్జీలు, సరుకు రవాణా చార్జీలు ధరలను హేతుబద్ధం గా ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణ, ధాన్యం కొనుగోలు విషయం లో ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ధాన్యం కొనుగోలు జరిగిన 21 రోజుల్లో చెల్లింపులపై స్పష్టత ఉందన్నారు. ప్రతీ రైతు భరోసా కేంద్రానికి అనుసంధానంగా ఉన్న కొనుగోలు కేంద్రానికి వచ్చే పంటకు సరిపడే మూడో శాతం గన్నీ బ్యాగులు సిద్దం చేసుకోవాలని,  వాటిని రొటేషన్ పద్దతిలో వినియోగించు కోవచ్చునని అన్నారు.  సాంకేతిక పరమైన సమస్య పరిష్కారం చెయ్యడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, ఆర్డీవో ఎస్. మల్లి బాబుఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి, డి ఎస్ వో పి. ప్రసాద రావు, డి ఎం (సి ఎస్) ఆర్. తనూజా, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవ రావు, డిపివో పి. జగదంబ సహాయ మేనేజర్ త్రినాధ్ తదితరులు ఆయా మండలాలు నుంచి విసి లో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *