Breaking News

ఉద్యోగుల సమస్యలపై చిత్తశుద్ధితో కృషి చేయాలి. నూతన కార్యవర్గానికి జిల్లా అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ పిలుపు

కంచికచర్ల, నేటి పత్రిక ప్రజావార్త :
ఉద్యోగులకు పెన్షనర్లకు సంబంధించిన అనేక సమస్యలు పిఆర్సి డి ఎ, పెండింగ్ బిల్లుల మంజూరు, సిపిఎస్ రద్దు వంటి పలు అంశాలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అపరిస్కృతంగా ఉన్నాయని, వీటన్నింటినీ సాధించే క్రమంలో నూతనంగా ఏర్పడిన కంచికచర్ల ఎన్జీవో అసోసియేషన్ యూనిట్ కార్యవర్గం చిత్తశుద్ధితో దృఢ సంకల్పంతో పనిచేయాల్సిన అవసరం ఉందని, వారికి ఉద్యోగులందరూ తమ చేయూతను తోడ్పాటును అందించాల్సిన ఆవశ్యకత ఉన్నదని జిల్లా అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ అన్నారు. స్థానిక బస్టాండ్ దగ్గరలో పశువుల ఆసుపత్రి వీధిలో ఏపీ ఎన్జీఓస్ హోమ్ నందు గురువారం నాడు కంచికచర్ల ఎన్జీవో యూనిట్ ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికలలో పదకుండు పదవులకు గాను పదకుండు నామినేషన్ లు రావడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా ఎన్నికల అధికారి యువి పురుషోత్తమ రాజు తెలిపారు. అదేరోజు సాయంత్రం నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణస్వీకారం నిర్వహించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ మాట్లాడుతూ ముందుగా నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పరిష్కరించాలని, డిఎ లు మంజూరు చేయాలని, ఉద్యోగులకు సంబంధించిన జిపిఎఫ్ ఏపీజిఎల్ బిల్లులు గత సంవత్సర కాలంగా ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నాయని వాటన్నిటిని మంజూరు చేయాలని, పరిష్కారం చేసే దిశగా రాష్ట్ర నాయకత్వం ఇచ్చే ప్రతి పిలుపుకు ఉద్యోగులు కంచికచర్ల కార్యవర్గం స్పందించడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అలాగే ఉద్యోగులకు పేన్షనర్స్ సకాలంలో ఒకటో తారీఖున జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కంచిక తాళం తాలూకా అయినట్టు పరిధిలోని ఉద్యోగులకు సంబంధించిన ఏ అంశాన్ని జిల్లా నాయకత్వం దిష్టి తీసుకొచ్చిన పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.
నూతనంగా ఎన్నికైన కార్యవర్గ అధ్యక్షుడిగా ఎవి శివారెడ్డి, కార్యదర్శిగా ఎం బిక్షాలు వైద్య మరియు ఆరోగ్యశాఖ. కోశాధికారిగా షేక్ నాగుల్ పంచాయతీరాజ్ శాఖ. సహథాక్షుడుగా ఎం అంకమ్మరావు రెవిన్యూ శాఖ. ఉపాధ్యక్షులుగా వి వెంకటేశ్వర రెడ్డి వైద్య మరియు ఆరోగ్యశాఖ. కే శిరీష రెవెన్యూ శాఖ. వై దాసు సోషల్ వెల్ఫేర్. సంయుక్త కార్యదర్శిలుగా యం శ్రీనివాసరావు వైద్య మరియు ఆరోగ్యశాఖ. డి దివ్య స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్ శాఖ. ఎన్ బాల కోటేశ్వరరావు పశుసంవర్ధన శాఖ. షేక్ తరభి మహిళా శిశు సంక్షేమ శాఖల నుండి ఎంపికయ్యారు. ఎన్నికల ప్రక్రియలు ఎన్నికల అధికారిగా యూవీ పురుషోత్తంరాజు, సహాయ ఎన్నికల అధికారిగా శ్రీనివాసరావు, ఎన్నికల పరిశీలికలుగా యం రాజూబాబు వ్యవహరించారు. ఈ ప్రమాణస్వీకారం కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు జి రామకృష్ణ, బి ఆర్ నాగేంద్ర, బి సతీష్ కుమార్, విజయవాడ నగరశాఖ అధ్యక్షుడు జె స్వామి. సంయుక్త కార్యదర్శి సివిఆర్ ప్రసాద్ మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *