విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఓట్ల రాజకీయాలు చేయకుండా కులమత పార్టీలకతీతంగా అర్హతే ప్రామాణికంగా అందరికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. నియోజకవర్గంలో వంద రోజులకు పైగా నిరాటంకంగా సాగిస్తున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గురువారం 2వ డివిజన్లోని 24వ సచివాలయ పరిధిలోని జమీందారు వీధి నుంచి ప్రారంభమై ప్రతిభానికేతన్ రోడ్, వాటర్ ట్యాంక్ రోడ్, హై స్కూల్ రోడ్డు, ఎలిసెల వారి వీధి ప్రాంతాలలో వైస్సార్సీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లతో కలిసి ఇంటింటికి వెళ్లిన అవినాష్ ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ లబ్ది వివరాలను అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం ప్రభుత్వం లో కేవలం ఓట్లు కోసం వారి పార్టీ వారికే సంక్షేమ పథకాలు అందించేవారని, ఏదైనా నియోజకవర్గంలో వారి పార్టీ వారు ఓడిపోతే అసలు అక్కడ అభివృద్ధి గురించి, ప్రజల గురించి పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసేవారని విమర్శించారు.కానీ నేడు జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ప్రమాణస్వీకారం రోజు ఇచ్చిన మాట ప్రకారం గెలుపోటములతో సంబంధం లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీలు చూడకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అన్నారు. నేడు ఈ పర్యటన లో భాగంగా ఇంటింటికి వెళ్ళినప్పుడు ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన వారి కుటుంబానికి కూడా సున్నా వడ్డీ పధకం అందింది ఇదే మా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అని అన్నారు. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రన్ని పురోభివృద్ధి దిశలో జగన్ నడిపిస్తున్నారు అని, మరో 30ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రి గా ఉండలని ప్రజలు కోరుతున్నారు అని చెప్పారు. ప్రజలలో రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి ప్రతిపక్ష పార్టీల గుండెల్లో గుబులు పట్టుకొంది అని వారి పార్టీ భవిష్యత్ కోసం గాబరా పడుతున్నారని ఎద్దేవా చేశారు. అందుకే రాజకీయ మనుగడ కోసం సానుభూతి రాజకీయలకు తెరలేపారు అని, లేని రాళ్లదాడిని సృష్టించి అల్లర్లు రేపడనికి ప్రయత్నించారని విమర్శించారు. మీరు ఎన్ని కుట్రలు చేసిన ప్రజల మద్దతు వైస్సార్సీపీ ప్రభుత్వానికి ఉందని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో 2వ డివిజన్ కార్పొరేటర్ అంబడిపూడి నిర్మలాకుమారి, వైసీపీ నాయకులు చందా కిరణ్, చినబాబు, మెయిన్, కోటేశ్వరరావు, శ్రీను, షాన్ బాబా, వెంకటేశ్వరరావు, శివ, కుటుంబరావు, కనుపర్తి బాబు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News