Breaking News

ఘనంగా మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి వేడుకలు… : గాంధీ నాగరాజన్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనాబ్‌ భారతరత్న మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ 135వ జయంతి పురస్కరించుకొని మైనార్టీ సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవం కార్యక్రమాలను గాంధీదేశం సోషల్‌ వెల్పేర్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపకులు గాంధీ నాగరాజన్‌ ఊర్మిళనగర్‌లోని తన ట్రస్టు కార్యాలయంలో శుక్రవారం మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ నాగరాజన్‌ మాట్లాడుతూ మొదటి విద్యాశాఖా మంత్రి మౌలానా అబ్దుల్‌ కలాం అజాద్‌ దేశానికి 11 సం॥ అధికారంలో వున్న విషయాన్ని 11 సం॥ జైలులో వున్న విషయాన్ని ఆయన ఘనతను వివరించారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆయన సేవలను గుర్తించాలన్నారు. ప్రతి రాష్ట్రంలో ఆయన శిలా విగ్రహం తప్పని సరిగా వుండాలని, ప్రతి స్కూలులో ఆయన ఫొటో వుండాలని కోరారు. దీనిపై కేంద్ర రాష్ట్ర పాలకులకు లేఖ రాయనున్నామన్నారు. దీనిపై అందరూ కులమతాలకు అతీతంగా సానుకూలంగా స్పందించాలని వేడుకుంటున్నానన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆ మహనీయునికి అర్పించే నిజమైన నివాళి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గాంధీదేశం ట్రస్ట్‌ సభ్యులు ఆర్‌.శివరంజని, బి.భారతి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *