విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో ప్రజల సమస్యలు మరింత రెట్టింపు అయ్యాయని, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని తెలుగు మహిళ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి అన్నారు. శనివారం కేశినేని శివనాథ్ (చిన్ని) కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెన్నుపాటి ఉషారాణి మాట్లాడుతూ మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని ఆమె విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిలో దృష్టిలో పెట్టుకోకుండా సొంత లాభమే అనే పద్ధతిలో జగన్ రెడ్డి పరిపాలన కొనసాగుతుందని, రాష్ట్రంలో మహిళలపై ఎక్కడపడితే అక్కడ దాడులు, మానభంగాలు జరుగుతున్నా, వాటిని అరికట్టడంలో, మహిళలకు రక్షణ కల్పించడంలో జగన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె విమర్శించారు. దిశా చట్టం ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తామని ప్రచారాలు చేసిన జగన్ రెడ్డి దిశా చట్టం ద్వారా ఎన్ని శిక్షలు వేశారు ఎంతమందికి రక్షణ కల్పించారో చెప్పగలరా అని ఆమె ప్రశ్నించారు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు SK కరీముల్లా మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ రెడ్డి పరిపాలనలో కూల్చడం, కబ్జాలు చేయడం, దోచుకోవటం అనే పద్ధతుల్లో కొనసాగుతుందని ఆయన విమర్శించారు. సంక్షేమ పథకాలే ప్రచార ఆర్భాటంగా, చెప్తున్న జగన్ రెడ్డి, సంక్షేమ పథకాల లబ్ధిదారులను, అనేక కొత్త నిబంధనలు పెట్టి తొలగించటం సంక్షేమ రాజ్యమా అని ఆయన ప్రశ్నించారు, రాష్ట్రంలో జగన్ రెడ్డి ప్రభుత్వం అన్ని తరగతుల ప్రజల ఉపాధి మీద, దెబ్బ కొట్టిందని, పన్నుల మీద పన్నులు వసూలు చేస్తూ ప్రజల మీద భారాల మీద భారాలను మోపుతుందని ఆయన అన్నారు.
అర్బన్ మైనారిటీ మాజీ అధ్యక్షులుSK ఇర్ఫాన్ మాట్లాడుతూ, సంక్షేమ పథకాలను రద్దుచేసి, మైనారిటీల సంక్షేమ పథకాలలో కోత విధించిన మైనారిటీ ద్రోహి ఈ జగన్ రెడ్డి అని, రాబోయే కాలంలో ముస్లిం మైనార్టీ లందరూ జగన్ రెడ్డికి బుద్ధి చెబుతారని ఆయన తెలియజేశారు.
Prajavartha Online Telugu News