విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు కారణంగా ఏ ఒక్కరూ కూడా వైద్యం అందక ఇబ్బందులు పడకూడదు అనేదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన అని,అందుకే వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకున్న సరే ఆరోగ్య శ్రీ పరిధిని విస్తరించి వెయ్యి రూపాయలు దాటిన వైద్య సేవలను చేర్చడంతో పాటు, ప్రక్క రాష్టాల్లో కూడా వైద్యం చేయించుకునే వెసులుబాటు కల్పించారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. శనివారం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో 4వ డివిజన్ కు చెందిన చెరుకూరి కుటుంబ నాగేశ్వరరావు కు వైద్య ఖర్చు నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరు అయిన పది లక్షల రూపాయల చెక్కును అవినాష్ అందజేసారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ నాగేశ్వరరావు అనారోగ్యంతో బాధపడుతు వైద్యానికి భారీ మొత్తంలో ఖర్చు పెడుతూ ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన వారి పార్టీ కాకున్నా సరే జగన్ గారి ఆలోచనలకు అనుగుణంగా వారికి అండగా నిలవడానికి ముఖ్యమంత్రి సహాయనిధి కి మా కార్యాలయం ద్వారా ఆర్జీ పెట్టించారని, తక్షణమే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పది లక్షల రూపాయలు మంజూరు అయ్యేలా చేయడమే కాకుండా నేడు వారికి నేరుగా చెక్కును అందజేయడం సంతోషంగా ఉందని, ఇదే మా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అని సగర్వంగా చెప్పారు. గత తెలుగుదేశం ప్రభుత్వం లో ముఖ్యమంత్రి సహాయనిధి ని టీడీపీ నాయకులు నిర్వీర్యం చేశారని, స్వర్గీయ వైయస్సార్ పెట్టిన ఆరోగ్య శ్రీ ని కార్పొరేట్ ఆసుపత్రిలతో కలిసి కుమ్మక్కై అవినీతి కి పాల్పడ్డారని విమర్శించారు. నాడు ఎవరికైనా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సహాయం అందలి అంటే జన్మభూమి కమిటీలకు లంచాలకు ఇచ్చే పరిస్థితి అని,అదే వారు ప్రక్క పార్టీ అయితే అసలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని ఆరోపించారు. కానీ నేడు ఎవరికి లంచాలు ఇచ్చే అవసరం లేకుండా పార్టీలతో సంబంధం లేకుండా అవసరమైన ప్రతి ఒక్కరికి పారదర్శకంగా లబ్ది చేకూరుతుంది అని అవినాష్ అన్నారు. నాగేశ్వరరావు త్వరగా కొలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సొంగా రాజ్ కమల్, బచ్చు మాదవి, బచ్చు మురళి, జెపి రెడ్డి, కావటి దామోదర్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News