విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
టీడీపీ సీనియర్ నాయకులు కేశినేని శివనాథ్ (చిన్ని) సౌజన్యంతో, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర జిల్లాల ఇంఛార్జి బుద్ధా వెంకన్న మరియు తెలుగుదేశం పార్టీ బీసీ మైనార్టీ నాయకులు రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుర్ మీరా ఆధ్వర్యంలో కేశినేని ఫౌండేషన్ వారిచే నడపబడుతున్న మొబైల్ అన్న క్యాంటీన్ సోమవారం రథం సెంటర్ నందు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువనాయకులు కాండ్రేగుల రవీంద్ర , సాదరాపోయిన ఏడుకొండలు, ఉమ్మడి వెంకటేశ్వరరావు చంటి, కామా దేవరాజు, గణప రాము, చీపుళ్ళు వెంకటేశ్వర్రావు, ఈ గల సాంబ, ఆదిత్య కిరణ్, అమానుల్లా, సౌమి వెంకటేశ్వర్లు, బొమ్మిడి రాము, పిల్ల సాయి, ఆన్సర్, జాహిద్, రాజగిరి అశోక్, సగురుపిల్ల రమేష్, చె౦చయ్య తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News