-నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, సోమవారం జాతీయ రహదారి రామవరప్పాడు రింగు నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్ వరకు కారిడార్ నిర్మాణo జరుగుతున్న పనులను క్షేత్ర స్థాయిలో అధికారులతో కలసి పరిశీలించారు. ప్రసాదంపాడు దగ్గర జరుగుతున్న కారిడార్ పనులను వాటి యొక్క వివరాలను మరియు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో అడిగితెలుసుకొని, కాంట్రాక్టర్స్ వర్కర్స్ లను మరియు యంత్రాలను ఎక్కువగా పెట్టి పనులను వేగవంతంగా పూర్తి చేయాలనీ సంబందిత అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. అలాగే రోడ్డు ప్రక్కన ఉన్నఎంక్రోచ్మెంట్ షెట్టర్ లను తొలగించాలని సంబందిత అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. రూరల్ లో కారిడార్ ఏరియా సంబంధించి శానిటేషన్ పనులు సరిగ్గా లేదని పంచాయితీ సెక్రటరీలకు ఆదేశాలు ఇచ్చారు.
తదుపరి ఎక్సెల్ ప్లాంట్ల సందర్శన, సింగ్ నగర్ నందలి ఎక్సెల్ ప్లాంట్ ను కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, అధికారులతో కలసి సందర్శించి ప్లాంట్ ఆవరణలో ఎంట్రన్స్ గేట్లు, శానిటరీ ఆఫీసు బిల్డింగ్, స్టోర్ రూమ్, డ్రైవర్స్ టాయిలెట్స్(రెస్ట్ రూమ్) కట్టడానికి ప్లాన్ రెఢీ చేసి సాయంత్రం లోగా సబ్మిట్ చేయాలని కమిషనర్ గారు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. వీటితో పాటుగా ఎక్సెల్ ప్లాంట్ యొక్క కంపౌన్ వాల్ పనులు వేగవంతము చేయాలని అన్నారు.
అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) శ్రీమతి కె.వి సత్యవతి, ఎగ్గిక్యుటివ్ ఇంజనీర్ ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, ఎగ్గిక్యుటివ్ ఇంజనీర్ శ్రీనివాసు, శానిటరీ ఇన్స్ పెక్టర్లు మరియు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News