Breaking News

జగనన్న ఇళ్ల నిర్మాణాలపై కొందరివి అసూయ తాలూకా వెక్కిళ్లు !!

పెడన, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇళ్ల నిర్మాణాన్ని రాజకీయం చేయాలని కొందరు కుట్రలు పన్నుతున్నారని, అవి వారి అసూయ తాలూకా వెక్కిళ్ళని, ప్రజలే వారి తీరుని అసహ్యించుకుంటున్నారని ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 10 వేల ఇళ్ళు సంపూర్ణ స్థాయిలో నిర్మితమయ్యాయని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ గణాంకాలతో సహా చెప్పారు.
పవిత్ర కార్తీక మాసం మూడవ సోమవారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో ఆయన పెడన మున్సిపాలిటీ నాలుగవ సచివాలయం పరిధిలోని 11వ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
తొలుత ఆయన పెడన తోటమూల సూజీ కంపెనీ ప్రాంతం (11 వ వార్డు)లో బొర్రా వెంకటేశ్వరరావు, కొనకళ్ళ నాగేశ్వరరావు, సమ్మెట సుజాత, గుండాబత్తిన ఆదిలక్ష్మి, ముద్దినేని పావని, గొల్లపల్లి విజయలక్ష్మి, గరికముక్కు లక్ష్మి, పుప్పాల జయలక్ష్మి, రెహమాన్ బేగం, బొమ్మదారి కాంతమ్మ, కరీమున్నీసా, ఓదురు రామకృష్ణ, కోట సామ్రాజ్యం, పన్నెంరెడ్డి వెంకటరామయ్య, ముక్కు ముసలి, మురుగుడు ఈశ్వరి, కుంభా కుమారి, అస్మతున్నిసా, తమ్మిశెట్టి గంగాభవాని, మోదుగుముడి ఆంజనేయులు, కొసనం ప్రసాద్, ఉమ్మడి కృష్ణమూర్తి, బళ్ళా కృష్ణకుమారి, పామర్తి ఆంజనేయులు, పిచ్చుక సుబ్బయ్య తదితరుల గృహాలను సందర్శించి ఒక్కొక్కరికి ఇప్పటివరకు అందిన వివిధ ప్రభుత్వ పథకాల వివరాలు తెలిపారు. అలాగే, వారు చెప్పిన స్థానిక సమస్యలు ఓపిగ్గా విని అక్కడే ఉన్న పలు శాఖల అధికారుల ద్వారా వాటిని తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి జోగి రమేష్ వివరించారు.
అనంతరం మంత్రి జోగి రమేష్ పలువురితో మాట్లాడుతూ, ఇది ప్రజా సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వమని అన్నారు. గృహ నిర్మాణ విషయమై ప్రభుత్వం ప్రతి శనివారం హౌసింగ్ డే గా ప్రకటించిందన్నారు. లేఔట్లకు మౌలిక వసతుల కల్పన వేగంగా జరుగుతోందన్నారు. డిసెంబర్ 21 నాటికి గృహప్రవేశాలకు అనువుగా విద్యుత్ సౌకర్యం, రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, తాగునీటి వసతి తదితర కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఆర్థికంగా ఇబ్బంది గా ఉన్న లబ్ధిదారులకు డ్వాక్రా, బ్యాంకుల ద్వారా లోన్ అందించేలా ఏర్పాట్లు సైతం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కృష్ణాజిల్లాలో జగనన్న లేఔట్లలో ఇళ్ల నిర్మాణం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పెడన మునిసిపల్ ఛైర్మెన్ బళ్ళా జ్ఞాన లింగ జ్యోత్స్నా రాణి, వైస్ ఛైర్మెన్ ఎం.డి. ఖాజా, 11 వ వార్డు కౌన్సిలర్ మల్లా కోటమ్మా , 3 వ వార్డు కౌన్సిలర్ బళ్ళా గంగయ్య, పెడన తహసీల్దార్ పి.మధుసూదన రావు, పెడన మునిసిపల్ కమీషనర్ ఎం. అంజయ్య, పెడన మునిసిపాలిటీ ఫ్లోర్ లీడర్ కటకం ప్రసాద్, కటకం నాగకుమారి, హోసింగ్ డి ఈ ఏ శ్రీనివాసరావు , వైస్సార్ సీపీ పెడన పట్టణ అధ్యక్షులు బండారు మల్లిఖార్జునరావు, కోడూరు శ్రీనివాస్, స్థానిక ప్రజా ప్రతినిధులు , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు,వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *