గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర సమాచార కమీషన్ కు కొత్తగా చీఫ్ కమీషనర్ గా మరియు కమీషనర్ లుగా నియమితులైన సీనియర్ జర్నలిస్ట్ లు ఆర్. మహబూబ్ భాషా, పి. శామ్యూల్ జోనతన్ లను విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మరియు టెలికాం సలహ కమిటి ఉమ్మడి గుంటూరు జిల్లా సభ్యులు నిమ్మరాజు చలపతిరావు గురువారం రాష్ట్ర సమాచార కమీషన్ కార్యాలయంలో వారిని కలిసి అభినందించారు. ఈ సందర్భంగా నిమ్మరాజు చలపతిరావు మాట్లడుతూ ముఖ్య వార్తా కధనాల కోసం జర్నలిస్ట్ లకు అవసరమైన కీలక సమగ్ర సమాచారం అందేలా సహకరించాలని కోరారు. అనంతరం రాష్ట్ర సమాచార కమీషన్ ఇతర సబ్యులు బి.వి. రమణ కుమార్, ఇలాపురం రాజా లను కుడా మర్యాదపూర్వకంగా కలిసారు
Prajavartha Online Telugu News