Breaking News

రచయితలు, కవి సమ్మేళనం, సెమినార్‌

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వురు ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయములొ నిర్వహించుచున్న 55 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా గురువారం  రచయితలు, కవి సమ్మేళనం, సెమినార్‌ ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్ర్రమంలో తుట్టగుంట భైరవమూర్తి, రిటైర్డు తెలుగు పండిట్‌ అధ్యక్షత వహించగా రిటైర్డు లెక్చరర్‌ రాయప్రోలు కామేశ్వర శర్మ, రిటైర్డు లెక్చరర్‌, కవి, పుస్తక రచయిత అనిపెద్ది జగన్నాథ శాస్త్రి, రిటైర్డు తెలుగు పండిట్‌ చామర్తి విశ్వనాథం మరియు ఎ.బి.ఎన్‌.&పి.ఆర్‌.ఆర్‌.ఉన్నత కళాశాల విద్యార్థిని కుమారి ఎమ్‌.శ్రీలలిత పాల్గొలన్నారు.
ఈ కార్య్యక్రమానికి అధ్యక్షత వహించిన భైరవమూర్తి మాట్లాడుతూ పిల్లల కేరింతలు, చిరునవ్వులతో ఏ ఇల్లు ప్రతిధ్వనులతో నిండి ఉంటుందో అక్కడ ఆరోగ్యం ఉంటుంది. పిల్లలందరూ గ్రంథాలయాన్ని ప్రతీ వారం సందర్శించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న చామర్తి విశ్వనాథ శర్మ మాట్లాడుతూ పద్యాలతో ఆరోగ్యం ఆనందం వస్తాయని అందరూ రోజుకొక పద్యం నేర్చుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాయప్రోలు కామేశ్వర శర్మ మాట్లాడుతూ గ్రంథాలయం ఒక దేవాలయం అనీ, గ్రంథాలయ సమంస్థానం గోవూరే నాస్తికించన అని దానిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనిపెద్ది జగన్నాథశాస్త్రి మాట్లాడుతూ శ్రీశ్రీ, గుర్రం జాషువా వంటి మహాకవులు స్ఫూర్తి ప్రదాతలు. కవిత్వానికి జాతి, మత, కుల, లింగ వివక్ష లేదన్నారు. సార్వకాలిక, సార్వజనిక కవిత్వం ఇప్పుడు రావల్సిన అవసరం ఉందని కొవ్వూరులో కవిత్వం నేర్చుకోవడానికి ఒక వర్క్‌ షాప్‌ ప్రతీ నెల నిర్వహిస్తామని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎ.బి.ఎన్‌.&పి.ఆర్‌.ఆర్‌.ఉన్నత కళాశాలలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుచున్న విద్యార్థిని కుమారి ఎమ్‌.శ్రీలలిత అమ్మ, గురువు, మహిళలపై కవితలు చదివారు.
సాంస్కృత పాఠశాల ప్రథానోపాధ్యాయులు శ్రీ గోవర్థనం శ్రీనివాసమూర్తి సభను నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ ఉద్యోగులు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, పాఠకులు మరియు వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గోన్నారు.
అనంతరం పాఠశాల విద్యార్థులకు జూనియర్స్‌ మరియు సీనియర్స్‌ విభాగంలో ‘‘దేశ భక్తి గీతాలు మరియు లలిత గీతాల’’ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో సుమారు 160 మంది విద్యార్థులు పాల్లొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *