Breaking News

ప్రకాశం జిల్లా తమ్మలూరు గ్రామం ఆర్యవైశ్య సంఘం కార్తీక వన సమారాధన…


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రకాశం జిల్లా తమ్మలూరు గ్రామం ఆర్యవైశ్య సంఘం కార్తీక వన సమారాధన కొత్తూరు తాడేపల్లిలోని అటవీశాఖ ఉద్యానవనంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ రుహుల్లా, విజయవాడ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు కొనకళ్ల విద్యాధరరావు, వై.యస్‌.ఆర్‌.సి.పి వాణిజ్య విభాగం అధ్యక్షులు పల్లపోతు మురళీకృష్ణ హజరయ్యారు. అనంతరం వారిని సంఘం సభ్యులు సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కోట పుల్లారావు, మిత్తింటి చంద్రశేఖర్‌, కోట గుర్నాధరావు తదితరులు మాట్లాడుతూ ఇక్కడకు వచ్చి 50 సంవత్సరాలు అయి స్థిర నివాసం ఏర్పరుచుకున్న సందర్భంగా ఏర్పాటుచేసిన కార్తీక వన సమారాధనలో భాగంగా సత్యనారాయణ వ్రతం సుమారు 500 మందితో నిర్వహించుకున్నామన్నారు. కరోనా తర్వాత ఈ సంవత్సరం వివిధ ప్రాంతాల నుండి అన్ని కుటుంబాల వారు ఇక్కడికి వచ్చి ఒక్కటిగా చేరి క్షేమ సమాచారాలు తెలుసుకుని అందరి కుటుంబ సభ్యులతో గడపడం వల్ల కొంత వరకు ఆటవిడుపుతోపాటు మానసికోల్లాసం, మనోధైర్యం మాకు మావాళ్ళు వున్నారనే భరోసా పెరుగుతుందన్నారు. ఇటువంటి కార్యక్రమం అందరి కుటుంబాలతో ఆనందంతో ప్రతి సంవత్సరం నిర్వహించాలను కోరుకుంటున్నామన్నారు. పిల్లల కోసం వివిధ రకాల ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మిత్తింటి గోపీకృష్ణ, చిట్లూరి శ్రీనివాసరావు, తదితర సంఘ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *