Breaking News

కృష్ణా జిల్లా హోల్ సేల్ డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కార్తీక వాన సమారాధన…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా జిల్లా హోల్ సేల్ డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మంగళగిరి డాన్ బాస్కో స్కూల్ వద్ద నిర్వహించిన కార్తీక వాన సమారాధన కార్యక్రమం ఆదివారం ఘనంగాజరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా విచ్చేసిన మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ పని ఒత్తిడి తగ్గించే మానసిక ఉల్లాసానికి వన సమారాధనలు తోడ్పడతాయన్నారు. రోజువారి పనిఒత్తిడి నుండి కొంత సమయం ఆహ్లాదకరమైన వాతావరణంలో కుటుంబ సభ్యులతో గడపడం వల్ల వారు మరింత ఉత్సాహంతో ఉంటారన్నారు. రోజువారి కార్యక్రమాలతో పాటు కొంత సమయాన్ని ప్రశాంతతకు కేటాయించడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తారని అన్నారు. అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలిచేందుకు ప్రతి వారు  కృషి చేయాలని కోరారు. ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా తాను  అందుబాటులో ఉంటానన్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ కరోనా తర్వాత ఈ సంవత్సరం వివిధ ప్రాంతాల నుండి అన్ని కుటుంబాల వారు ఇక్కడికి వచ్చి ఒక్కటిగా చేరి క్షేమ సమాచారాలు తెలుసుకుని అందరి కుటుంబ సభ్యులతో గడపడం వల్ల కొంత వరకు ఆటవిడుపుతోపాటు మానసికోల్లాసం, మనోధైర్యం మాకు మావాళ్ళు వున్నారనే భరోసా పెరుగుతుందన్నారు. ఇటువంటి కార్యక్రమం అందరి కుటుంబాలతో ఆనందంతో ప్రతి సంవత్సరం నిర్వహించాలను కోరుకుంటున్నామన్నారు. పిల్లల కోసం వివిధ రకాల ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు పల్లపోతు మురళి కృష్ణ (కొండపల్లి బుజ్జి), విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొనకళ్ల విద్యాధరరావు తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *