Breaking News

సిటిజెన్ పర్సెప్షన్ సర్వే…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం వారు చేపట్టిన సిటిజెన్ పర్సెప్షన్ సర్వేలో భాగంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, సోమవారం రాజీవ్ గాంధీ పార్కులో హిజ్రాలతో మమేకమయ్యే కార్యక్రమం నిర్వహించారు. హిజ్రాలను వివక్షతో చూడకూడదు వారు మన సమాజంలో అందరితో సమానమనే ఉద్దేశంతో వారితో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వారు కాసేపు అలా పార్క్లో సేదతీరి, అధికారులతో ఫోటోలు దిగారు. అదే విధంగా హిజ్రాలతో కలసి ఈజీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్-2022 కేంద్ర ప్రభుత్వం గృహకల్ప, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దేశంలోని నగరాల్లో జీవన ప్రమాణాలు, సుస్థిరమైన వసతులు, ఆర్ధిక వనరులపై సిటిజన్ పర్సెప్షన్ సర్వే చేస్తుందని తెలిపారు. ఈ సర్వేలో నగరంలో అందిస్తున్న వసతులపై ప్రశ్నావళి ఉంటుందని నగర వాసులందరూ ఈ సర్వేలో పాల్గొని జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచేలా సహకరించాలన్నారు. ఈ సందర్భంగా EOL – 2022 (ఈజీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్-2022) బ్రోచర్స్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అధనపు కమీషనర్(ప్రాజెక్ట్స్) కే. వెంకట సత్యవతి, పి.ఓ. యు.సి.డి కే. శకుంతల, మరియు సి.డి.ఓ జగదీశ్వరి తదితర అధికారులు ఈ సమావేశానికి హాజారయ్యారుహాజారయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో బుధవారం జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *