Breaking News

ప్రభుత్వం ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలనే సదుద్దేశంతో నిర్వహించే కార్యక్రమం స్పందన…

-స్పందన కార్యక్రమంతో ప్రజలకు న్యాయం చేయండి..
-జిల్లా అధికారులతో` కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందనలో ఆర్జీలను స్వీకరించి ఆర్జీదార్ల నుండి సమస్యను పూర్తిగా విని అర్థం చేసుకుని పరిష్కరించిన్నప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.
స్థానిక పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించి అర్జీ దారులనుండి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుంచి అర్జీదార్లు తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే ఆశతో స్పందనను ఆశ్రయిస్తారన్నారు. ఆర్జీదార్లల నుండి ఆర్జీని స్వీకరించి రశీదు ఇచ్చినంతమాత్రన సమస్యలు పరిష్కారం కాబోవని, సంబంధిత అధికారులు ఆర్జీదారుడు ఇచ్చిన వినతిని క్షుణ్ణంగా పరిశీలించి సమస్య గుర్తించి త్వరితగతిన తగు న్యాయం చేయాలన్నారు. వినతిపై సంబంధిత అధికారులు సిబ్బందితో ముఖాముఖి మాట్లాడి సమస్యను పరిష్కరించిన్నప్పుడే స్పందన లక్ష్యం నేరవేరుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందన మంచి ఫలితాలను ఇస్తూన్నాయని దాదాపు 50 శాతం పైగా సమస్యలను అక్కడిక్కడే పరిష్కరించగలుగుతున్నామన్నారు. మిగిలిన ఆర్జీలు కొన్ని కోర్టుల పరిధిలోను, మరి కొన్ని రెవెన్యూ కోర్టుల పరిధిలోను ఉంటున్నాయని వాటిని ఏవిధంగా పరిష్కారించాలనే ఆలోచన చేయాలన్నారు. అదేవిధంగా సబ్‌ డివిజన్‌, రస్తాల ఈజ్‌మెట్‌ ఏవిధంగా చేయాలనే విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు. స్పందన పోర్టల్లో గడువులోగా పరిష్కరించాల్సిన వాటిని తక్షణమే పరిష్కరించాలని గడువు తీరిన అర్జీలు ఉండరాదన్నారు. 48 గంటలలో పరిష్కరించాల్సిన వాటిపై అధికారులు దృష్టి సారించాలన్నారు. మండల స్థాయిలో అధికారులు స్పందన ఆర్జీలపై పరిష్కారం చూపకపోవడంతో అధిక స్థాయిలో అర్జీలు పునరావృతం అవుతున్నాయని ఆయన వివరించారు. అధికారులు చిత్తశుద్దితో పనిచేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని తద్వారా అర్జీదారులకు సరైన న్యాయం జరుగుతుందని కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.
స్పందనలో 85 వినతులు నమోదు కాగా వీటిలో అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 36, పోలీస్‌ 11, యంఎయుడి 7, విద్య 3, వైద్య 3, సర్వే అండ్‌ సెటిమెంట్‌ 3, పంచాయతీరాజ్‌ 7, వివిధ శాఖలకు సంబంధించి 15 అర్జీలు నమోదయ్యాయన్నారు. తన పరిధిలోని వాటిని కలెక్టరు తక్షణమే పరిష్కరించగా కొన్నింటిని విచారించి పరిశీలించాలన్నారు.
కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌, అసిస్టెంట్‌ డిప్యూటి కలెక్టర్లు ఎస్‌.రామలక్ష్మి, ఖతీఫ్‌ కౌసర్‌ బానో, డ్వామా పీడి జె సునీత, డీఈవో సీివీ రేణుక, ఐసీడీఎస్‌ పీిడి యం.ఉమాదేవి, గ్రామ, వార్డు సచివాలయ జిల్లా అధికారి కె. అనురాధ, డీఎస్‌వో పి.కోమలి పద్మ, హౌసింగ్‌ పీడి శ్రీదేవి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *