విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొదలుపెట్టిన ప్రతి పనిని శరవేగంగా పూర్తి చేస్తూ అభివృద్ధి లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారు అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు.మంగళవారం నాడు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్ లయోలా గార్డన్స్ నందు దాదాపు 38 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో మూడు ఇన్నర్ రింగ్ రోడ్స్ శంకుస్థాపన కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి,దేవినేని అవినాష్ చేతుల మీదగా శంకుస్థాపన చేసారు. అవినాష్ మాట్లాడుతూ ఈ డివిజన్లో ఉన్న అన్ని కాలనీ లలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్ళ కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చొరవతో విజయవాడ నగరంలో ఏ డివిజన్లో లేని విదంగా దాదాపు 9కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ,కార్పొరేటర్ ఉండి కూడా గత 5 సంవత్సరాలు ఈ డివిజిన్ అభివృద్ధి ని పట్టించుకోలేదు, ఇప్పుడు వచ్చి వైసీపీ ప్రభుత్వం పూర్తి చేసిన పనుల వద్ద ఫోటోలు దిగి వారి ఘనత గా ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటు అని విమర్శించారు. ప్రజలు అంత గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో మీకు గట్టిగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు.జగన్ గారు రాష్ట్రం అంత సమ అభివృద్ధి చెందలని ఓడిపోయిన సరే తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసారని,రాబోయే 30 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రి గా ఉండాలని ప్రజలు అంత కోరుకొంటున్నారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,4వ డివిజన్ ఇంచార్జ్ గల్లా పద్మావతి మరియు కాలనీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News