విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని వారి సంపూర్ణ మద్దతుతో రాబోయే ఎన్నికల్లో మరింత భారీ మెజారిటీతో తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ ధీమా వ్యక్తంచేశారు. మంగళవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 4వ డివిజన్ 21వ సచివాలయ పరిధిలోని ఎన్టీఆర్ కాలని,వెటర్నరీ కాలనీ ప్రాంతాలలో వైస్సార్సీపీ నాయకులు,సచివాలయ సిబ్బంది,వాలంటీర్లతో కలిసి ఇంటింటికి వెళ్లిన అవినాష్ ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ లబ్ధిని వివరించి ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ విప్లవం మొదలుపెట్టారని అధికారంలోకి వచ్చిన కేవలం మూడేళ్ళ కాలంలోనే 95 శాతం పైగా హామీలు అమలు చేయడంతో పాటు,ఎన్నికల మెనిఫెస్టో లో లేని ఎన్నో పధకాలు ఆచరణలో పెట్టారని కొనియాడారు. గడపగడపకు వస్తున్న వైస్సార్సీపీ నాయకులకు బ్రమహారథం పడుతున్న ప్రజల స్పందన చూస్తుంటేనే ప్రభుత్వం పట్ల వారు ఎంత సంతృప్తి గా ఉన్నారో అర్థం అవుతోంది అని అన్నారు. ప్రజలలో రోజురోజుకు జగన్ కు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు అన్ని ఏకమై వారి మనుగడ కోసం ప్రాకులాడుతున్నాయని, కానీ అవన్నీ వృధా ప్రయాస తప్ప ఫలితం ఉండదని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా ప్రజా ధనం దుర్వినియోగం చేసి, టీడీపీ నాయకులు సొంత ఆస్తులు పెంచుకోవడానికే పాటుపడ్డారని, లంచాలు,దందాలతో మహిళలను హించించారని విమర్శించారు. అందుకే గత ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పి వైస్సార్సీపీ కి ఘన విజయం అందించారని అన్నారు. ఓడిన సరే తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని సహకారం అందిస్తూ వందల కోట్ల నిధులు మంజూరు చేస్తున్నారని, ప్రజా సమస్యలను తీర్చడానికి అండగా నిలుస్తున్నారు అని చెప్పారు.ఈ కార్యక్రమంలో 4వ డివిజన్ ఇంచార్జ్ గల్లా పద్మావతీ,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ సుంకర రాజేష్,నల్లూరి సుబ్బారావు,నర్సింహారావు,ప్రకాష్,రంగ ప్రసాద్,చోదరి,గోపాలకృష్ణ,మాధవ శేఖర్,శంకర్ తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News