విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగుదేశం పార్టీ నాయకులు కేశినేని ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ కేశినేని శివనాథ్ (చిన్ని) కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగు మహిళ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి, తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్.కె.ఆషా లు మాట్లాడుతూ విజయవాడ రాజధాని నగరంలో వైసీపీ పార్టీకి చెందిన ఓ మహిళ అక్రమంగా వ్యభిచారం నిర్వహిస్తూ యువతల జీవితాలను నాశనం చేస్తూ అధికారం అడ్డం పెట్టుకుని ఈ రకంగా ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవడం అన్యాయమని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో చీమచిట్టుకుమన్న పోలీసు వ్యవస్థకు నిఘా వ్యవస్థ తెలిసిపోతుంది అటువంటిది ఇటువంటి చర్యలు ఎందుకు కనపడలేదున్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడి యువతల జీవితాలతో చెలగాటమాడుతున్న వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని లేనిపక్షంలో తెలుగు మహిళలగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో తెలుగు మహిళ విజయవాడ పార్లమెంట్ నాయకురాలు మాదల రాజ్యలక్ష్మి, సయ్యద్ గౌస్య, శివకుమారి, నాగరత్నం తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News