Breaking News

భూ హక్కుల పత్రాల ముద్రణ ప్రక్రియ పూర్తి అయి భూ యజమానులకు పంపిణీకి సిద్దం..

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భూముల రీసర్వే పూర్తి అయిన గ్రామాలకు సంబంధించి ముద్రణ పూర్తి అయిన భూ హక్కు పత్రాలలోని వివరాలను పున:పరిశీలన చేస్తున్నామని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. ఢల్లీిరావు, ప్రభుత్వ ముఖ్య సలహదారు అజయ్‌కలాం కు వివరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, సర్వే అధికారులతో గురువారం సిసిఎల్‌ఏ ప్రధాన కార్యాలయం నుండి ప్రభుత్వ ముఖ్య సలహదారు అజయ్‌కలాం వైయస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు భూ రక్ష పథకంలో భాగంగా భూముల రీసర్వే ప్రక్రియపై వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.
జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు నగరంలోని ఆయన కార్యాలయం నుండి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతూ
వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకంలో భూముల రీసర్వే పనులు పూర్తి చేసిన 14 గ్రామాలకు సంబంధించి భూ హక్కు పత్రాల ముద్రణ ప్రక్రియ తుది దశలో ఉందన్నారు. సర్వే పూర్తి అయిన గ్రామాలలో రికార్డులలోని వివరాలను క్షేత్రస్థాయి సర్వే వివరాలతో పున:పరిశీలన చేస్తున్నామన్నారు. భవిష్యత్‌లో భూ యజమానులకు ఎటువంటి ఇబ్బందులు, వివాధాలకు తావులేకుండా శాశ్వత ప్రతిపాదికన నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని 41 గ్రామాలలో డ్రోన్‌ ఫ్లైయింగ్‌ పూర్తి చేశామన్నారు. రీ సర్వే పూర్తి అయిన గ్రామాలలో భూముల హద్దులను తెలిపే భూరక్ష హద్దు రాళ్ళను నాటె కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నామని కలెక్టర్‌ డిల్లీరావు ప్రభుత్వ ముఖ్య సలహదారుకు వివరించారు.
వీడియోకాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌కుమార్‌, జిల్లా సర్వే అండ్‌ ల్యాండ్‌ రికాడ్స్‌ ఆఫీసర్‌ కె. సూర్యరావు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *