విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో భారత రాజ్యాంగం ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని మాల మహాసేన రాష్ట్ర కోఆర్డినేటర్ పీటర్ జోసఫ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. శనివారం బైక్ ర్యాలీలతో వెళ్ళి విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం సమీపమునందు ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీటర్ జోసఫ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఆమోద దినోత్సవాన్ని సంవిధాన్ దివస్ అని కూడా అంటారని, ఇదే రోజును జాతీయ చట్ట దినోత్సవంగా కూడా జరుపుకుంటమన్నారు. 1949 నవంబర్ 26న భారతదేశం రాజ్యాంగాన్ని దత్తత చేసుకుందని, ఆ తర్వాత 1950 జనవరి 26 నుంచి భారత్‌లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని వివరించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్, షెడ్యూల్స్ లోని అంశాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధి, పురోగతి కోసం ప్రతి ఒక్కరూ పునరంకితమై కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ నుండి అంబేద్కర్ మహాసేన రాష్ట్ర అధ్యక్షులు రాయబారపు సంతోష్ మరియు ఏలూరు జిల్లా అధ్యక్షులు పత్తిపాటి వినీత్ కుమార్ విజయవాడ నగర అధ్యక్షులు పృథ్వి వైభవ్ ఎన్టీఆర్ జల యోజన విభాగ అధ్యక్షులు బండి ప్రదీప్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు కయుం భాషా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఎం లెనిన్ బాబు ఖాదర్ జాన్ తదితరులు యువకులు పాల్గొని విజయవంతం చేశారు.
Prajavartha Online Telugu News