విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ నవీన్ కుమార్ ఆదేశానుసారం జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మండలి నోడల్ ఆఫీసర్ డాక్టర్ జె ఉషారాణి ఆధ్వర్యంలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయవాడ లో మెడికల్ మరియు పారామెడికల్ సిబ్బందికి ఏపీ సాక్స్ కొత్తగా ప్రవేశపెడుతున్న సేఫ్ కేర్ సెంటర్స్ కాన్సెప్ట్ పైన అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ ఎయిడ్స్ నియంత్రణ మండలి హెచ్ఐవి ఎయిడ్స్ నివారణ, నియంత్రణలో చేపడుతున్న కార్యక్రమాలను విస్తృతంగా వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి అదనపు సంచాలకులు మరియు హాస్పటల్ సూపర్డెంట్ డాక్టర్ సౌభాగ్య లక్ష్మి అధ్యక్షత వహించారు. నాకు జిల్లా జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మండలి చేపడుతున్న కార్యక్రమాలు హెచ్ఐవి ఎయిడ్స్ నివారణలో ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటాయని, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఉచితంగా హెచ్ఐవి పరీక్ష, ఏ ఆర్ టి మందులను, వైరల్ లోడ్, CD 4 టెస్టులను, అదేవిధంగా రక్త నిధి నుంచి రక్తాన్ని కూడా అడ్మిట్ అయిన రోగులకు అందిస్తున్నామని చెప్పారు. భారతదేశంలోనే వైరల్ లోడ్ పరీక్షల్లో అత్యధికంగా పరీక్షలు నిర్వహించినందుకు గాను హెచ్ఐవి వైరల్ లోడ్ సెంటర్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా వైద్యాధికారిని ఉమ్మడి కృష్ణాజిల్లాలో, అదేవిధంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో హెచ్ఐవి ఎయిడ్స్ నివారణలో గర్భిణీ స్త్రీలకు, చిన్న పిల్లలకు, హైరిస్క్ పాపులేషన్ వారికి, డ్రగ్ యూజర్స్ కు, ట్రాక్టర్స్ కు, వలస కార్మికులకు, హిజ్రాలకు కు అందిస్తున్న ఉచిత సేవలు గురించి. సిబ్బంది అందర్నీ కూడా ఈ సేవలను ప్రజలు ఉపయోగించుకునే విధంగా చూడాలని కోరారు.
తదుపరి డాక్టర్ ప్రభు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సేఫ్ కేర్ సెంటర్ కాన్సెప్ట్ను వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ ఏపీ సాక్స్ మాగంటి నవీన్, ఏ ఆర్ టి సెంటర్ ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ వెంకటకృష్ణ, ఆర్ఎంవో డాక్టర్ శోభ, ఓ ఎస్ టి సెంటర్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ విజయలక్ష్మి, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమ అధికారి కిరణ్ పందిటి, జిల్లా సూపర్వైజర్ ప్రశాంతి చౌదరి, ఆసుపత్రి మెడికల్ పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News