విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కుల, మత, ఉగ్రవాద ఘర్షణల్లో నిరా శ్రయులైన పిల్లలకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నేషనల్ ఫౌండేషన్ ఫర్ కమ్యూనల్ హార్మనీ కింద నిధుల సేకరిస్తున్నట్లు ఎఫ్ సీఐ రీజనల్ జిఎం చంద్రశేఖర్ అన్నారు. దీనిలో భాగంగా సోమవారం అయ్యప్పన గర్ లోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో ఎఫ్ సీఐ అధికారులు, సిబ్బంది ఫౌండేషన్ కు స్వచ్ఛందంగా విరాళాలు అందజేశారు. డిప్యూటీ జీఎంలు అశిష్, అజయ్ కుమార్, భువనే శ్వరి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News