Breaking News

ఎండీయూ ఆపరేటర్లను ఆదుకోవాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9 వేలకు పైగా ఉన్న ఎండీయూ ఆపరేటర్ల సమస్యలపై పలు దఫాలుగా ప్రభుత్వంతో చర్చలు జరిపిన్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వెంటనే జోక్యం చేసుకొని సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్‌ ఎండీయూ ఆపరేటర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు విత్తనాల అనిత కోరారు. మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో విత్తనాల అనిత మాట్లాడుతూ ప్రభుత్వ పథకంలో భాగస్వాములుగా ఉన్న తాము వాహనాలను పౌరసరఫరాల సంస్థకు అద్దెకు పెట్టి అప్పులపాలు అయ్యా మని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారులు ముందు ఉంచిన 29 న్యాయమైన డిమాండ్లలో ఏ ఒక్కటీ పరిష్కారం కాలేదన్నారు. ముఖ్యంగా వాహన భీమాను ప్రభుత్వమే కడుతుందని ఒప్పుకొని ఏడాది కావస్తున్నా ఇప్పటికీ తమకు చెల్లించలేదని ఇప్పుడు రెండవ వాయిదా కట్టాలని భీమా సంస్థ ప్రతినిధులు ఫోన్లు చేస్తున్నారని తెలిపారు. సక్రమంగా చెల్లించకపోవడం వల్ల మా సిబిల్‌రేట్‌ పడిపోతుందన్నారు. ఇప్పటికైనా తమ సమస్యలను గుర్తించి ఎండీయూ ఆపరేటర్లను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.అంబేడ్కర్‌ మాట్లాడుతూ వాహన డ్రైవర్లుగా విధులు నిర్వహిస్తూ చనిపోయిన కుటుంబానికి రూ.20 లక్షల నష్టపరిహారం చెల్లించాలని, తమను గ్రామ సచివాలయం ఉద్యో గులుగా గుర్తించి ప్రతి నెలా రూ.18 వేల గౌరవ వేతనం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారు వి.యాగ్నేష్‌, గంగాధర్‌, లవకుశ యాదవ్‌, రాజు, సోసియేషన్‌ వివిధ జిల్లాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *