Breaking News

ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలి : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత గతంలో ఎవరూ చేయనివిధంగా ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ కోరారు. శుక్రవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 4వ డివిజన్, 7వ సచివాలయం పరిధిలో సుబ్బారావు కాలనీలో నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో కలిసి అవినాష్ పర్యటించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కాలండర్ను అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేపట్టి నాటి తెలుగుదేశం ప్రభుత్వం లో ప్రజలు పడుతున్న అవస్థలు స్వయంగా చూసి రూపొందించిన ఎన్నికల మ్యానిఫెస్టోను అధికారంలోకి వచ్చిన వెంటనే తూచా తప్పకుండా అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని అన్నారు.సచివాలయ,వలంటీర్ వ్యవస్థ లను ప్రవేశపెట్టి లంచాలకు తావులేకుండా పారదర్శకంగా లబ్ధిదారులకు నేరుగా సంక్షేమ లబ్ది అందిస్తున్న ప్రభుత్వానికి మనమంతా అండగా నిలవాలని అవినాష్ పిలుపునిచ్చారు. స్వర్గీయ దేవినేని నెహ్రూ గారు ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు ఈ ప్రాంతంతో వ్యక్తిగతంగా ఎక్కువ ఆత్మీయంగా ఉండేవారని, అదే అభిమానంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసారని అన్నారు.కానీ తరువాత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం లో స్థానిక కార్పొరేటర్ అధికార పార్టీ వ్యక్తి అయ్యుండి కూడా అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేసారని, మరలా ఇప్పుడు వైస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత దాదాపు 80లక్షల రూపాయల వెచ్చించి అంతర్గత రోడ్లు, సైడ్ డ్రైనేజ్ నిర్మాణాలు, పార్కు ల అభివృద్ధి చేయడం జరిగిందని, ప్రజలు మరో మూడు రోడ్లు మరమ్మతులు గురుంచి మా దృష్టికి తీసుకురాగా సచివాలయానికి మంజూరు అయిన 20లక్షల రూపాయల నిధులతో ఆ పనులు పూర్తి చేయాలని అధికారులను కోరినట్టు తెలిపారు. ఒకవైపు ప్రభుత్వం ఇన్ని మంచి కార్యక్రమాలు చేపడుతుంటే ఓర్వలేక ప్రతిపక్ష టీడీపీ వారి రాజకీయ మనుగడ కోసం అసత్య ప్రచారాలు చేయడం సిగ్గుచేటు అని, స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వారి మనుషులకు డబ్బులు, మందు ఇచ్చి అనవసర రాద్ధాంతం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు అని ఆరోపించారు. మీరు ఎన్ని కుట్రలు చేసిన సరే మీ డ్రామాలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ,మీ షో రాజకీయాలకు కాలం చెల్లిందని ఎద్దేవా చేశారు.ఈ కార్యక్రమంలో 4వ డివిజన్ లో గల్లా పద్మావతి,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,గల్లా రవి,ఆలీ,వెలగపూడి సుబ్బారావు,త్రినాధ్ రెడ్డి,రాజారావు,చిట్టిబాబు,కోటిరెడ్డి,గంటా సాయి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో బుధవారం జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *