Breaking News

జగనన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి… : మంత్రి జోగి రమేష్

గూడూరు (కల్పటం, లేళ్ళగరువు), నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి ఇంటి సంక్షేమం కోసం నిత్యం శ్రమిస్తున్న జగనన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. గూడూరు మండలం, లేళ్ళగరువు సచివాలయం పరిధిలోని కల్పటం, లేళ్ళగరువు గ్రామాల్లో శుక్రవారం ఆయన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు వివరిస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంతకంతో కూడిన కరపత్రాన్ని లబ్ధిదారులకు అందించారు.
ఈ సందర్భంగా మంత్రి ఇంటింటిని సందర్శిస్తూ గ్రామస్తులను ఆప్యాయంగా పలకరించారు. ఒక్కొక్క లబ్ధిదారునకు నవరత్నాల పథకాలతో ఎంత లబ్ధి పొందుతున్నది మంత్రి వివరించారు. తమకు సక్రమంగా అందుతున్న పథకాల పట్ల లబ్ధిదారులు సంతోషాన్ని వ్యక్తపరిచారు. మంత్రి గ్రామస్తులతో మాట్లాడుతూ ప్రజలందరి సంక్షేమం కోసం నిత్యం శ్రమిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని మనసారా ఆశీర్వదించాలని కోరారు. రానున్న కాలంలో మరింత సంక్షేమాభివృద్ధికి ప్రజలందరూ ముఖ్యమంత్రికి ప్రోత్సాహాన్ని అందించాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల పట్ల తమకు ఎలాంటి లోటు లేదని, సంతోషంగా ఉన్నామని, అయితే డ్రైనేజీలు, రోడ్లు నిర్మించాలని గ్రామస్తులు మంత్రిని కోరగా, సచివాలయం, నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అందించే నిధులతో తప్పకుండా నిర్మిస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. లేళ్ళగరువు గ్రామంలో ఇంటింటిని సందర్శించే క్రమంలో వైయస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్ ను సందర్శించి అందుతున్న సేవలపై వైద్య సిబ్బందిని మంత్రి ఆరా తీశారు. సిబ్బంది ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గూడూరు ఎంపిపి సంగా మధుసూదన రావు, గూడూరు జెడ్పిటీసి వేముల సురేష్ వెంకట రంగబాబు, కల్పటం, లేళ్లగరువుల సర్పంచులు ఐనాల శ్రీనివాసరావు, నరహరిశెట్టి మానస, గూడూరు మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తలుపుల కృష్ణారావు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కారుమంచి కామేశ్వరరావు, ఎంపీటీసీ యర్రంశెట్టి శ్రీనివాసరావు, ఆర్బీకే చైర్మన్ పర్ణం మహాలక్ష్మి నాయుడు, పిఎసిఎస్ చైర్మన్ రాయపురెడ్డి శ్రీనివాసరావు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గొర్రెపర్తి రవికుమార్, నాగబాబు, పెడన ఇంచార్జీ, గూడూరు మండల ఎంపీడీవో డి. సుబ్బారావు, వీఆర్వో మౌనిక, తహసీల్దార్ బి.వి ప్రసాద్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *