Breaking News

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జిల్లా స్థాయి అవగాహన సదస్సు


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయవాడ జోనల్ ఆఫీస్ వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అవగాహన సదస్సు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవన్ లో జరిగినది. ఈ కార్యక్రమాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు చేపడుతున్న దేశస్థాయి బ్యాంకింగ్ అంబుడ్స్ మెన్ మరియు సైబర్ నేరాలు పై విస్తృత అవగాహన కార్యక్రమంలో భాగంగా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చినటువంటి శ్రీ నవనీత్ కుమార్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హాజరయ్యారు ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ బ్యాంకు ఖాతాదారులు తమకు బ్యాంకులలో ఎదురయ్యేటువంటి సమస్యలను పరిష్కరించడంలో బ్యాంకింగ్ అమ్భుస్ మెన్ చక్కగా వినియోగ పడుతుందని తెలిపారు. అదేవిధంగా ఖాతాదారులు ఏదైనా ఏదైనా బ్యాంకు సేవలో లోపం గుర్తిస్తే వెంటనే తగు శాకాధికారికి ఫిర్యాదు చేయవలెనని ఆ ఫిర్యాదుకు 30 రోజులలో పరిష్కారం కా నీ యుడలా బ్యాంకింగ్ ombudsman కంప్లైంట్ చేయవచ్చని తెలిపారు. ombudsman వారు అటువంటి ఫిర్యాదుని పరిశీలించి పది రోజులలో దానికి పరిష్కారము చూపమని బ్యాంకు లను ఆదేశిస్తారని తెలిపారు. తో పాటు డిజిటల్ బ్యాంకింగ్ లావాదేవీలు జరిపేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్త లా గురించి వివరించారు .ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన ఈ రాజు బాబు agm SLBC వారు మాట్లాడుతూ బ్యాంకు ఖాతాదారులు మరియు సాధారణ ప్రజలు సైబర్ నేరాల పట్ల తగిన అవగాహన కల్పించుకోవాలని ఎవరైనా అటువంటి మోసానికి గురైతే 1930కు తక్షణమే ఫిర్యాదు చేయవలని తెలిపారు. అదేవిధంగా ఖాతాదారులు ఎప్పుడు తమ బ్యాంకు ఖాతా వివరాలు ఏటీఎం కార్డు వివరాలు ఓటిపి వివరాలు ఇతరులకు చెప్పరాదని తెలిపారు. నేటి సమాజంలో ఉన్నత విద్యామంతులు కూడా ఈ సైబర్ మోసాలకు గురి అవుతున్నారని కావున అందరూ వీటి పట్ల జాగ్రత్త వహించాలని, తమ బ్యాంకు ట్రాన్సాక్షన్స్ ధ్రువీకరించిన మొబైల్ యాప్ మరియు ఇంటర్నెట్ లింకులు ద్వారా మాత్రమే జరపాలని సూచించారు. అలాగే అపరిచిత వ్యక్తులు లాటరీ వచ్చిందని మీకు ఉద్యోగం ఇప్పిస్తామని మీ బ్యాంకు ఖాతా వివరాలు కనుక్కొని మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తారని వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో UBI రీజినల్ హెడ్ రజనీకాంతరావు, మూర్తి డి జి ఎం సెంట్రల్ బ్యాంక్ మరియు వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు,ఎన్టీఆర్ జిల్లా ఎల్డిఎం పి కోటేశ్వరరావు వివిధ బ్యాంకుల ఖాతాదారులు మరియు బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *