Breaking News

అజ్మీర్ షరీఫ్ దర్గాకు చాదర్ సమర్పించిన కృష్ణాజిల్లా ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా

-ముఖ్యమంత్రి జగన్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు…
-ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ఖాజా బాబా ఆశీస్సులు..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మత సామరస్యానికి ప్రతీక అయిన రాజస్థాన్ రాష్ట్రంలోని పుణ్య ధామం అజ్మీర్ షరీఫ్ “సుఫీ సెయింట్ హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి హసన్ సంజరి రజి అల్లాహు అన్ హు మహాత్ముల వారి పవిత్ర దర్గాకు కృష్ణాజిల్లాా ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా చాదర్ అందజేశారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ వాంబే కాలనీ లో 2023 జనవరి 29న జరగనున్న ఆస్థాన ఏ గరీబ్ నవాజ్ అజ్మీర్ షరీఫ్ ఖాజా బాబా ఆశ్రమం 7 వ వార్షికోత్సవ వేడుకలు, అజ్మీర్ షరీఫ్ ఉరుసు మహోత్సవాలకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కు అజ్మీర్ దర్గాకు వెళ్తుండటంతో ఖాజా బాబా ఆశ్రమ కమిటీ ప్రతినిధులకు షాదిఖానా ఏరియా మైనార్టీ కమిటీ ఆధ్వర్యంలో పరమ
పవిత్ర శుక్రవారం అజిత్ సింగ్ నగర్ కార్యాలయంలో రుహుల్లా చెతుల మీదుగా చాదర్ సమర్పించారు .. ముస్లిం మైనార్టీ పెద్దలతో కలిసి సర్వ మానవాళి సంక్షేమాన్ని కోరుతూ దువా చేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు ఎండి హఫీజుల్లా, ఈ కార్యక్రమంలో పలు మైనార్టీ సంఘాల నాయకులు షేక్ రహీం ,రషీద్, ఇమాం భాష ,జలీల్ ఖాన్, జిలాని ,అస్లం తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *