విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక భవానిపురంలో గల ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు శుక్రవారం నాడు జయహో బీసీ మహా సభ పోస్టర్ ను ఎమ్మెల్సీ రుహుల్లా
ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 7 వ తేదీన విజయవాడలో జరగనున్న జయహో బీసీ మహాసభ పోస్టర్ ను ఆవిష్కరించామన్నారు.వైఎస్ జగన్ సిఎం అయినప్పటి నుంచి రాష్ట్రంలో చక్కటి పాలన అందిస్తున్నారన్నారు.చంద్రబాబు, టిడిపి బిసిలను, ఎస్ సి, ఎస్ టి, మైనార్టీలను ఓటు బ్యాంకు గా వాడుకుని వదిలేశారన్నారు. బీసీలను పరిపాలనలో భాగస్వామ్యం చేసిన వ్యక్తి సిఎం జగన్ అని కొనియాడారు.అన్ని కులాలకు కార్పొరేషన్లకు ఏర్పాటు చేసి అండగా ప్రభుత్వం ఉందని నిరూపించిన వ్యక్తి సిఎం జగన్ అని అన్నారు.50 శాతం రిజర్వేషన్ ఇస్తూ చట్టం చేసిన ఘనత వైఎస్ జగన్ కే దక్కుతుందన్నారు.అన్ని నామినేటెడ్ పదవుల్లో బిసిలకు పెద్ద పీట వేశారన్నారు. 84 వేల మంది బీసీ నాయకులతో మహాసభ నిర్వహిస్తున్నామని తెలిపారు.బిసిలకు ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం మాది అని అన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో బీసీ పదవుల హోదాల్లో ఉన్నవారందరూ తప్పనిసరిగా మహాసభ కు రావాలని కోరారు.ప్రభుత్వం మీద బురద జల్లేందుకు చంద్రబాబు అనేక కుయుక్తులు పన్నుతున్నారన్నారు. చంద్రబాబు, లోకేష్, దత్తపుత్రుడు ఎన్ని కుయుక్తులు పన్నినా జగన్మోహన్ రెడ్డిని ఏం చేయలేరనీ సవాలు విసిరారు. దత్తపుత్రుడు గురించి రాష్ట్ర ప్రజలు ఆలోచనే చేయడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ బలగాలతో సెక్యురిటిని చంద్రబాబు పొందుతున్నారు.. తనకు ప్రాణహాని ఉందనే చీప్ ట్రిక్స్ వద్దనీ హితవు పలికారు. సైకిల్ పాలన వస్తుందని చంద్రబాబు కలలు కంటున్నారన్నారు. సైకిల్ టైర్లు ఎప్పుడో పంచర్లు అయ్యాయన్నారు. టిడిపి సైకిళ్లను ప్రజలు ఎప్పుడో చెత్త కుండీలో వేసేశారన్నారు. సైకిల్ పని ఇంక అయిపోయింది. చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు ని ప్రజలు ఎప్పుడో విస్మరించారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, తూర్పు నియోజకవర్గ ఇంచార్జి దేవినేని అవినాష్, దుర్గ గుడి మాజీ చేర్మేన్ పైలా సొమినాయుడు, వివిధ బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు డైరక్టర్లు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News