Breaking News

ప్రత్యేక ఓటర్ల సవరణ -2023 కార్యక్రమం పై బి ఎల్ ఓ లతో సమావేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియంలో ప్రత్యేక ఓటర్ల సవరణ -2023 కార్యక్రమం పై బి ఎల్ ఓ లతో సమావేశం లో నగరపాలక కమిషనర్ అనుపమ అంజలి మాట్లాడుతూ ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు తిరుపతి నియోజక వర్గాలలో ఇప్పటికే అందిన ఫారం-6, 7 మేరకు క్షేత్ర స్థాయిలో బి.ఎల్.ఓ లు రానున్న 6 రోజులు ఉదయం 6 నుండే పరిశీలనకు వెళ్ళాలని సూచించారు. జనాభా ప్రాతిపదికన ఓటర్ల జాబితా, 18 సంవత్సరాల యువత నమోదు చూడాలని అన్నారు. కళాశాలలో మరొకసారి డ్రైవ్ నిర్వహి౦చి 18 సం. యువత ఓట రు నమోదు చేయవలసి ఉంటుందని అన్నారు. పెండింగ్ ఫారం 6, 7 దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు డిసెంబర్ 8 నాటికి పెండింగ్ లేకుండా అన్ని దరఖాస్తులు పూర్తి కావాలని అన్నారు. 2023జనవరి 5 న ప్రకటించి ఓటర్ల జాబితా తప్పులు లేని పారదర్శకత గా వుండాలని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *