-కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సింగ్ నగర్ నందలి ఎక్సెల్ ప్లాంట్ ను కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ అధికారులతో కలసి సోమవారం ప్లాంట్ ఆవరణలో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారిచేసినారు. ప్లాంట్ లో ఆఫీసు కార్యాలయం, స్టోర్ రూమ్, డ్రైవర్స్ రెస్ట్ రూమ్ నిర్మాణాలలో నాణ్యత ప్రమాణాలు పాటించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారిచేసినారు. ప్లాంట్ ఆవరణలో జరుగుతున్న రోడ్ల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారిచేసినారు. అదే విధంగా ఎక్సెల్ ప్లాంట్ లో ఉన్న ఐకానిక్ పార్కులో జరుగుతున్న పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారిచేసినారు. అదే విధంగా ఎక్సెల్ ప్లాంట్ కు చెత్తను సేకరించుకు వచ్చిన ట్రాక్టర్లను పరిశీలించి నగరంలో కొబ్బరి బొండాల విక్రయదారులు పారవేసిన బొండాలను నేరుగా కాకుండా 4 ముక్కలుగా కట్ చేసిన వాటిని మాత్రమే ఎక్సెల్ ప్లాంట్ నకు తరలించునట్లుగా చూడాలని సూచిస్తూ, అందరు శానిటరీ ఇన్స్ పెక్టర్లు విధిగా వారి వారి వార్డ్ ల యందలి కొబ్బరి బొండాల వ్యాపారులకు వివరించి విధిగా ముక్కలు చేసిన బొందాలను మాత్రమే ప్లాంట్ నకు తరలించునట్లుగా చూడాలని ఆదేశించారు. అదే విధంగా చెత్త తో పాటుగా కాకుండా చెట్ల కొమ్మలను వేరుగా ప్లాంట్ నందలి ఉడ్ ఛాపర్ మిషన్ ప్లాంట్ నందు అందచేయాలని సూచించారు. ప్లాంట్ ఆవరణలో గల సమస్యలను గుర్తించి అధికారులకు ఆదేశాలు జారిచేసినారు. పర్యటనలో అదనపు కమీషనర్ (ప్రాజెక్ట్స్) శ్రీమతి కె.వి సత్యవతి, ఎగ్గిక్యుటివ్ ఇంజనీర్ ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, శానిటరీ ఇన్స్ పెక్టర్లు మరియు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News