Breaking News

“ఛలో పుంగనూరు” యాదవ మహాసభ పిలుపు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చిత్తూరు నియోజకవర్గం పుంగనూరులో రామచంద్ర యాదవ్‌ పై జరిగిన దాడిని అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లాకా వెంగళరావు యాదవ్‌ తీవ్రంగా ఖండిరచారు. విజయవాడ ప్రెస్‌ క్లబ్లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డాక్టర్‌ లాకా వెంగళరావు యాదవ్‌ మాట్లాడుతూ రామచంద్ర యాదవ్‌ ఇంటి పై సుమారు 50 మంది దుండగులు దాడి చేసి విలువైన ఆరు కార్లతో పాటు ఇంటిలోని విలువైన సామగ్రిని ధ్వంసం చేసి రూ.కోట్ల మేర నష్టం కలిగించడాన్ని తీవ్రంగా ఖండిరచారు. బిసిల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ, 56 శాతంగా ఉన్న తమపై దాడులు చేసి దూరం చేసుకుంటే మనుగడ ఉండదని స్పష్టం చేశారు. రామచంద్రయ్య పై జరిగిన దాడి ఘటనపై, విచారణచేసి, దోషులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ నెల 7న అఖిల భారత యాదవ మహాసభ పిలుపు ఇచ్చిన ‘ఛలో పుంగనూరు’ కార్యక్రమంలో యాదవులతో పాటు బీసీలంతా వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నూకాలమ్మ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా స్వామ్యం లేదని నియంత పాలన కొనసాగుతుందన్నారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవశ్యకత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ సంఘం నాయకులు, బిసి సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *