Breaking News

విలేకర్ల సేవలు అభినందనీయం

– ప్రవాసాంద్రుడు అమిరినేని వెంకట్ ప్రసాద్

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజంలో విలేకర్ల సేవలు అభినందనీయం అని ప్రవాసాంధ్రుడు అమిరినేని ప్రసాద్ అన్నారు. స్థానిక జె.ఎం.జె. కళాశాల వద్ద గల ఆయన నివాసంలో బుధవారం ఆంద్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిధి పాల్గొన్నారు. వెంకట్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభిత్వానికి మధ్య వారధిగా పని చేస్తూ సమాజాన్ని చైతన్య వంతం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం పాత్రికేయుల సంక్షేమానికి శ్రద్ద తీసుకోవాలన్నారు. ఫెడరేషన్ డివిజన్ అధ్యక్షుడు ఎం. రవి కుమార్ మాట్లాడుతూ ఫెడరేషన్ సబ్యులకు ఇటీవల పోస్టల్ ఇన్సూరెన్స్ కలిపించినట్లు అందుకు ఆర్థిక సహకారం తనవంతుగా సహకరించిన వెంకట్ ప్రసాద్ అభినందనీయులన్నారు. వెంకట్ ప్రసాద్ ను ఫెడరేషన్ ఫెడరేషన్ నాయకులు అంబటి శ్యామ్ సాగర్, పి. పున్నయ్య, డి. కోటేశ్వరరావు, జి. ప్రభాకర్, ప్రకాశరావు, జహీర్ లు శాలువా, సత్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కనపర్తి రత్నాకర్, ప్రేమ్ కుమార్, శేఖర్, భూషణం, సుబ్బారావు, మునిపల్లి. శ్రీకాంత్, ప్రసాద్ , రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *