Breaking News

తుఫాను నేపథ్యంలో రాబోవు రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులకు ధైర్యం చెప్పి భరోసా కల్పించాలి…

-ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి..
-జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తుఫాను నేపథ్యంలో రాబోవు రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నందున జిల్లాలో మండల, ఆర్ బి కే ప్రత్యేక అధికారులు ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తూ రైతులకు ధైర్యం చెప్పి భరోసా కల్పించాలని జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ అధికారులను ఆదేశించారు.

శుక్రవారం రాత్రి ఖరీఫ్ ధాన్యం కొనుగోలు పక్రియపై రెవెన్యూ, పౌరసఫరాలు, వ్యవసాయ శాఖ అధికారులతో  టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సమీక్షిస్తూ తుఫాను కారణంగా జిల్లాలో రెండు రోజులపాటు వర్షం పడే అవకాశం ఉన్నందున ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా వారి ధాన్యాన్ని రైస్ మిల్లులకు పంపించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఆర్ బి కే పరిధిలోని రైతులకు అవసరమైన గన్ని బ్యాగులను ముందుగానే సిద్ధం చేసుకుని అందజేయాలన్నారు.
ధాన్యం కొనుగోలు లో రైతు నుంచి ఎటువంటి పిర్యాదులు రాకూడదన్నారు . ఆయా ఆర్బీకేలు ద్వారా సేకరించి మిల్లులకు పంపుతున్నధాన్యం వివరాలు ఆన్ లైన్ వెబ్ సైట్ లో అప్ లోడ్ చెయ్యాలన్నారు. మండల ప్రత్యేకాధికారులు ధాన్యం ట్రాన్స్ పోర్ట్ , గన్ని బాగ్స్ సరఫరా విషయం లో  వ్యక్తి భాద్యతతో రైతుకు అందించా విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కోతలు ఆలస్యంగా ప్రారంభమైన గోకవరం, కోరుకొండ,సీతానగరం మండలాల్లో ప్రత్యేక ద్రుష్టి సారించి ధాన్యం కొనుగోలు వేగవంతం  చేయ్యాలన్నారు. రైతు ధాన్యం ఏ మిల్లుకు అనుసంధానం చేశారో  ఆ రైస్ మిల్లు రైతుకు గన్నిబాగ్స్ సరఫరా చేస్తుందని, మండల ప్రత్యేకాధికారులు ఆవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో ధాన్యం సేకరిస్తున్న అన్ని మండల తహసీల్దార్లు కార్యాలయాల్లో తేమ శాతాన్ని ధ్రువీకరించే మాయిచ్చుర్  మిషన్స్ ఏర్పాటు చెయ్యాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు. ధాన్యం రవాణా పక్రియలో ట్రాన్స్ పోర్ట్ సంబందించిన చార్జీలు ఎవరైనా రైతులు నుంచి వాసులు చేసినట్లు మా దృష్టికి వస్తే అటువంటి వారిపై కేసులు నమోదు చేయాలని డి ఎస్ ఓని జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ ఆదేశించారు. రైస్ మిల్లులకు పంపిన ధాన్యాన్ని ఆయా మిల్లర్స్ ఎటువంటి జాప్యం లేకుండా సకాలంలో తీసుకోవాలన్నారు.

టెలి కాన్ఫరెన్స్ లో మండల తాసిల్దారులు, పౌర సరఫరాలు, జిల్లా వ్యవసాయ అధికారి మాధవరావు, డీఎస్ఓ ప్రసాదరావు, డిఎం సివిల్ సప్లై తనూజ, మండల ఆర్ బి కే ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *