
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సూర్యారావుపేట కోవెలమూడి వారి వీధి నందు షైన్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో అలోవియా స్కిన్ అండ్ హెయిర్ సొల్యూషన్ నూతన హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ సభ్యులు సామినేని ఉదయభాను మీడియా తో మాట్లాడుతూ అప్పట్లో డాక్టర్ వికాస్ కాట్రగడ్డ విజయవాడ నగరం లో ఎంతో మంచి పేరు సంపాదించాడు. కొద్ది వయసులోనే డాక్టర్ గా మధ్య తరగతి కుటుంబాలకు పెద్దలు కూడా ఆరోగ్య శ్రీ ద్వారా అనేక రకాల సేవలు అందించారు. అలాగే కరోనా సమయం లో షైన్ హాస్పిటల్ నుంచి చాలా మంది పేసెంట్స్ ని పంపించాం. ఈ షైన్ హాస్పిటల్ కూడా విజయవాడ నగరం లో మధ్య తరగతి కుటుంబాల్లో వైద్య సేవలు అందించడం లో ముందు ఉంటుందని వారు అన్నారు. డాక్టర్ శ్రీ లేఖ సర్వేపల్లి మాట్లాడుతూ హాస్పిటల్ లో మెయిన్ హైర్ ట్రాన్స్ ప్రాన్ అండ్ కాస్మటాలజీ కూడా ఉంటుంది అని వారు తెలిపారు.
Prajavartha Online Telugu News