Breaking News

మత్తు పదార్ధాల దుర్వినియోగం పై అవగాహన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె.ప్రత్యూష కుమారి శనివారం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నందు నిర్వహించిన మత్తు పదార్ధాల దుర్వినియోగం పై అవగాహనా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డాన్ బోస్కో నవజీవన్ బాలభవన్, విజయవాడ వారి ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు మానవ హక్కుల దినోత్సవం అని, భారత రాజ్యాంగంలో కల్పించిన ప్రాథమిక హక్కుల గురించి ప్రత్యూష కుమారి తెలిపారు. ప్రతీ ఒక్కరు వారికి రాజ్యాంగం కల్పించిన హక్కులపై అవగాహన కలిగి ఉండటం ద్వారా వాటిని సంరక్షింకునే అవకాశం ఉందని తెలిపారు. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్ధాల తయారీ, సరఫరా, వాడకం వంటి నేరాలకు కఠినమైన శిక్షలు ఉన్నాయన్నారు. ఈ నేరాలలో పట్టుబడిన వారికి ఇంత కఠినమైన శిక్షలు, బెయిలు లభించడం కూడా కష్టతరమైన నేరాలుగా ఎందుకు పరిగణించ బడుతున్నాయో వివరించారు.
మత్తు పదార్ధాల వాడకం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని, నాడీ వ్యవస్థ, మెదడు, ఊపిరితిత్తులు, గుండె జబ్బులు సంభవిస్తాయని. వీటి నుండి కోలుకోవడం అంత సులభతరం కాదని తెలిపారు. వీటిని వాడిన వారే కాకుండా వారి కి చెందిన రాబోయే తరాల వారి మీద చాల దుష్ప్రభావాలు చూపు తున్నాయని తెలిపారు. వాటిలో అంగవైకల్యం, మనోవైకల్యంతో జన్మించడం లాంటి ప్రమాదాలు కూడా ఉన్నాయని అన్నారు.
అవినీతి మార్గంలో డబ్బు సంపాదించడం కోసం ఇలాంటి దారుణమైన నేరాలకు పాల్పడరాదని విజ్ఞప్తి చేశారు. ఈ నేరాలలో పట్టుబడటం వల్ల ఖైదీల జీవితంతో పాటు వారి మీద ఆధారపడిన వారి జీవితాలు కూడా దుర్భరమవుతాయని అన్నారు. ఏ పని చేసిన దాని వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అని ఒక్కసారి ఆలోచించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ ఎస్.రాజారావు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఎం.రాజకుమార్, నవజీవన్ బాలభవన్ ప్రోగ్రాం మేనేజర్ జి.శేఖర్ బాబు, సైకోలాజిస్ట్ డా.షీలా నికోలస్, సోషల్ వర్కర్ పద్మలత, జైలు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *