Breaking News

అభివృద్దే వైసీపీ ప్రభుత్వ నినాదం : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమం, అభివృద్ధి నినాదంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారు అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. మంగళవారం నియోజకవర్గ పరిధిలోని 11వ డివిజన్ లో కనకదుర్గ కాలనీ రోడ్ 9లక్షల తో బి.టి రోడ్ మరియు 13వ డివిజన్ లో నల్లూరి పాపయ్య స్ట్రీట్ బి.టి రోడ్ 20లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు జరిగిన శంకుస్థాపన పనులకు అవినాష్ ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని అందుకే హామీ ఇచ్చిన ప్రతి అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు పనులు పూర్తి అయ్యేలా నిరంతర పర్యవేక్షణ చేస్తూ నాణ్యత లోపం లేకుండా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం లో అర్భటంగా శంకుస్థాపన లు చేసి ప్రచారం చేసుకోవడం తప్ప పనుల పురోగతి గురుంచి పట్టించుకొనే వారు కాదని విమర్శించారు. వారు శంకుస్థాపన చేసిన ఎన్నో పనులు వైసీపీ ప్రభుత్వం లో పూర్తి చేశామని తెలిపారు. ఈ ప్రభుత్వం సంక్షేమం తప్ప అభివృద్ధి గురుంచి పట్టించుకోవడం లేదని విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలు ఒక్కసారి తూర్పు నియోజకవర్గనికి వచ్చి చూడండి ఈ మూడేళ్ళ లో నియోజకవర్గంలో మేము చేపట్టిన 400 కోట్ల రూపాయల అభివృద్ధి పనులే సమాధానం చేబుతాయాని అవినాష్ చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ టీడీపీ ప్రభుత్వం లో చేపట్టిన అభివృద్ధి అంతా ఆయన కంప్యూటర్ స్క్రీన్ మీద, లేదా ఆయన అనుకూల మీడియా పేపర్లో తప్ప వాస్తవ రూపంలోకి రాలేదని ఎద్దేవా చేశారు. ఆయన ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు వైస్సార్సీపీ కార్పొరేటర్లు గెలిచిన డివిజన్ లలో అసలు అభివృద్ధి చేసేవారు కాదని, వారు ఎన్నిసార్లు మొరపెట్టుకొన్న ఎన్ని నిరసన ప్రదర్శనలు చేసిన అసలు పట్టించుకొనేవారు కాదని విమర్శించారు. కానీ నేడు జగన్ గారు గెలుపోటములతో సంబంధం లేకుండా రాష్ట్రం అంతా అభివృద్ధి చేయాలనే ధ్యేయంతో, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తున్నారు అని కొనియాడారు. టీడీపీ, జనసేన నాయకులు ఎన్ని పాదయాత్ర లు, బస్ యాత్రలు చేసిన ప్రజల గుండెల్లో జగన్ గారి స్థానం చెక్కుచెదరదు అని, ప్రజల సంపూర్ణ మద్దతు తో తిరిగి మరలా జగన్ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,11వ డివిజన్ ఇంచార్జ్ పర్వతనేని పవన్,13వ డివిజన్ రామాయణపు శ్రీనివాస్, వైస్సార్సీపీ నాయకులు జమ్ముల ప్రసాద్, త్రిపురనేని చందు, చిమటా బుజ్జి,సన్నీ, కొల ఉమ, కోటం రాజు మరియు వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *