Breaking News

వైయస్సార్ పెన్షన్ పెంపు నిర్ణయం హర్షణీయం : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వృద్దులకు, మహిళలకు ఆసరాగా ఇస్తున్న వైయస్సార్ పెన్షన్ ను ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం మూడు వేలకు పెంచడానికి అనుగుణంగా వచ్చే నెల జనవరి నుండి 250 రూపాయలు పెంచుతూ మంగళవారం నాడు జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి వై.యస్,జగన్మోరెడ్డి  నిర్ణయం తీసుకోవడం హర్షణీయం అని పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. మంగళవారం 2750 పెన్షన్ పెంపు నిర్ణయానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలుపుతూ తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ కార్యాలయం వద్ద మహిళలు, వృద్దులు నిర్వహించిన జగనన్న చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమంలో అవినాష్ పాల్గొని ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వం మాదిరిగా ఎన్నికల కు రెండు నెలల ముందు హడావుడిగా పెన్షన్ పెంచి అదేదో ఘనత లా ప్రచారాలు చేసుకోకుండా ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన రోజు నుండే పెంచిన పెన్షన్ ఇస్తూ సంవత్సరానికి 250 రూపాయలు పెంచుతూ పోతున్న ఘనత ముఖ్యమంత్రి దే అని అన్నారు. అవ్వాతాతలు కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా వాలంటీర్లు ద్వారా ఒకటో తేదీ ఉదయనికే పెన్షన్ ఇస్తూ జగన్మోహన్ రెడ్డి మా ఇంటి పెద్ద కొడుకుగా అండగా నిలబడ్డారు అని వారు కొనియాడుతూ తమ ఆశీర్వచనాలు అందిస్తున్నారని, అది ప్రభుత్వం గొప్పతనం అని అన్నారు. ఈ కార్యక్రమంలో 2వ డివిజన్ కార్పొరేటర్ అంబడిపూడి నిర్మలాకుమారి, వైస్సార్సీపీ నాయకులు కోటి నాగులు, డేవిడ్ రాజు, చిన్నబాబు, సొంగా రాజ్ కమల్, శెటికం దుర్గాప్రసాద్, నాని మరియు పెన్షన్ మహిళలు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *