విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 25తేది నాటికి అభ్యంతరాలు లేని ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తామని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వివరించారు. ఓటర్ల జాబితాకు ఆధార్ అనుసంధానం, ఫారమ్-6 బి, ఓటర్ల నుంచి ఆధార్ వివరాలు సేకరణ, అప్ డేషన్, ఫ్రీ రివిజన్ ఆఫ్ ఎస్ఎస్ఆర్ కార్యాచరణ, పోలిగ్ కేంద్రాల హేతుబద్దీకరణ తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.
నగరంలో కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే దాదాపు ఆధార అనుసంధానం ప్రక్రియ పూర్తి చేశామన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల నుండి స్వీకరించిన ప్రతిపాదనలను పరిగణలోకి తోసుకొని ఓటర్ల జాబితా ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేస్తామన్నారు. ఫారమ్`6 బి సేకరణ ప్రక్రియను 72 శాతం పూర్తి చేశామన్నారు. మిగిలినవి త్వరితగతిన పూర్తి చేస్తామని, క్లైమ్స్ మరియు అభ్యంతరాల ప్రక్రియ ఈనెల 25వ తేది నాటికి పూర్తి చేస్తామన్నారు. గృహాలు లేని షెల్టార్స్లో నివాసం ఉండే వారి పైన, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్స్ ఓటర్ల పైన ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని మూడు నియోజకవర్గాల్లో జిల్లాతో పోలిస్తే కొంత వేగవంతం చేయవలసిన అవసరం ఉందని దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఓటర్ల జాబితా పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తామని కలెక్టర్ డిల్లీరావు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వివరించారు.
వీడియోకాన్ఫరెన్స్‌లో సబ్ కలెక్టర్ అదితి సింగ్, మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్, డిఆర్వో కె. మోహన్‌కుమార్, నియోజవర్గంలో రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News