-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కళారూపాల ద్వారా మన సంస్కృతి సాంప్రదాయాలకు జీవం పోసిన వృద్ద కళాకారులకు అదుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పెన్షన్లను మంజూరు చేస్తుందని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు గుర్తింపు కొరకు ధరఖాస్తు చేసుకున్న జిల్లాకు చెందిన కళాకారులకు గురువారం జిల్లా కలెక్టర్ డిల్లీరావు ఆయన కార్యాలయంలో మంజూరైన గుర్తింపు కార్డులను అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ పేదరికంలో ఉన్నప్పటికి కళాలపై ఉన్న మమకారంతో వ్యయ ప్రయాసలను లెక్క చేయక కళాల ద్వారా మన సంస్కృతి సాంప్రదాయాలను జీవం పోస్తున్న కళాకారులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. 58 సంవత్సరాలు నిండిన నిరుపేదలైన కళాకారులకు నెలకు 3 వేల రూపాలయ చొప్పున పెన్షన్ మంజూరు చేయడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో సంస్కృతుల వికాశానికి కళాకారులు అందిస్తున్న సేవలు మరవలేనివి అన్నారు. పౌరాణిక సాంఫీుక, నాటక రంగాలలో అభివృద్ధి చేసి కళాకారుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లాలో అర్హత కలిగిన కళాకారులకు గుర్తుంపు కార్డులను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. మంజూరైన గుర్తింపు కార్డుల ద్వారా కళాకారులు ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎన్టిఆర్ జిల్లాలో 190 వృద్దా కళాకారులు నెలకు 3 వేల రూపాలయ చొప్పున పెన్షన్ పొందుతున్నారన్నారు. గుర్తింపు కార్డుల కొరకు ధరకాస్తు చేసుకోవాలని కళాకారులను ఆహ్వానించామని ఇప్పటివరకు 13 మంది ధరఖాస్తు చేసుకోగా అర్హతకలిగిన 9 మంది కళాకారులకు గుర్తింపు కార్డులను మంజూరు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డిల్లీరావు తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి యు. సురేంద్రనాద్, ఆడియో విజువల్ సూపర్వైజర్ ఎ. సాయిబాబా, పబ్లిసిటీ అసిస్టెంట్ వి వి ప్రసాద్ కళాకారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News