-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భవానీ భక్తులు దీక్షలను విరమించేందుకు రాష్ట్ర నలుమూలల నుండి తరలివస్తారని అధికారులు అప్రమత్తంగా వుండి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు తెలిపారు.
భవానీ దీక్షాల విరమణ ఏర్పాట్లను గురువారం జిల్లా కలెక్టర్ డిల్లీరావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవానీ దీక్షల విరమణ మొదటి రోజున భక్తుల రద్దీ తక్కువగా ఉన్నప్పటికి రానున్న శుక్ర శని ఆదివారాలలో రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉందన్నారు. దీనిని దృష్టింలో పెట్టుకుని భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను ముందుగానే సమకూర్చాలన్నారు. భవానీ భక్తులు స్నానమాచరించేందుకు ఘాట్‌లను ఏప్పటికప్పడు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. భవానీలు స్నానమానంతరం వస్త్రాలను నదీలోకి జారవిడుస్తారని వాటిని ఎప్పటికప్పడు సేకరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్నాన ఘాట్ల వద్ద నిరంతరం గజఈతగాళ్ళు ఉండేలా పర్యవేక్షించాలన్నారు. కేశఖండన శాలలో భక్తులు సమర్పించిన తలనీలాలను ఏప్పటికప్పుడు సేకరించి పరిశుభ్రంగా ఉంచాలన్నారు. కేశఖండన శాల వద్ద క్షురకులు భక్తుల నుండి ఎటువంటి రుసుము వసులు చేయకుండా పర్యవేక్షించాలన్నారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది భవానీలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, గిరి ప్రదిక్షణ, హోమ గుండం ఏర్పాట్లు, ఇరుముళ్ల విరమరణ, అమ్మవారి దర్శనం, ప్రసాదం సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. క్యూలైన్‌ల ద్వారా భక్తులకు త్వరితగతిన అమ్మవారి దర్శనం చేసుకునేలా చూడాలని, భక్తులకు ప్రసాదాలకు లోటు లేకుండా సిద్దం చేసుకోవాలన్నారు. భవాని దీక్షల భక్తుల నుండి ఎటువంటి ఫిర్యాధులు రానీయకుండా కార్యక్రమ నిర్వహణపై అధికారులు అప్రతమత్తంగా ఉండాలని కలెక్టర్ డిల్లీరావు సూచించారు.
ఏర్పాట్ల పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట ఆలయ ఇవో దర్బముళ్ళ బ్రమరాంభ, ఇఇలు కోటేశ్వరరావు, ఎల్. రమాదేవి, ఆలయ అధికారులు ప్రధాన అర్చకులు ఉన్నారు.
Prajavartha Online Telugu News